Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

న్యూజిలాండ్‌లో హైదరాబాద్ వాసి మృతి

Abdul-Raheem-Fahad-Syed

వెల్లింగ్టన్: న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ సైమండ్స్ స్ట్రీట్ రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ రహీం ఫర్హాద్ సయ్యద్‌గా గుర్తించారు. ఫర్హాద్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆయన క్యాబ్‌ను మరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సయ్యద్ అక్కడికక్కడే చనిపోయాడు. ఫర్హాద్‌కు భార్య, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. కాగా, ఫర్హాద్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు సహకరించాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు మృతుడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసిన్నట్లు తెలుస్తోంది.

Indian taxi-driver killed in Auckland.

Comments

comments