Home అంతర్జాతీయ వార్తలు లిబియాలో కిడ్నాప్

లిబియాలో కిడ్నాప్

   Kidnap_Libia_manatelanganaన్యూఢిల్లీ: లిబియాలో నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ఇద్దరిని విడిచి పెట్టారు. రాజధాని ట్రిపోలి నుంచి భారత్‌కు వస్తున్న వీరిని మార్గమధ్యంలోనే ఉగ్రవాదులు అపహరించుకెళ్లారు. ఇది ఐఎస్‌ఐఎస్ పనిగానే భారత ప్రభుత్వం అనుమానిస్తోంది. కిడ్నాప్‌నకు గురైన వారిలో ఇద్దరు హైదరాబాదీలు, మరో ఇద్దరు కర్నాటక వాసులు ఉన్నారు. వీరిని హైద రాబాద్‌కు చెందిన గోపీకృష్ణ, బలరాం, బెంగ ళూరువాసి విజయ్‌కుమార్, రాయచూర్‌కు చెంది న లక్ష్మీకాంత్‌గా గుర్తించారు. నలుగురూ లిబి యాలోని సిర్తే విశ్వవిద్యాలయంలో అధ్యాపకు లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 29న నలుగురిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు శుక్రవారంనాడు సాయంత్రం ఇద్దరు కర్నాటక వాసులను విడిచి పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన గోపికృష్ణ, బలరాంను బందీలుగానే ఉంచుకున్నారు.

kidnap_manatelanganaవీరి విడు దలపై ఇంకా ఉత్కంఠ కొనసా గుతూనే ఉంది. దీంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర ఆం దోళన చెందుతున్నారు. మరోవైపు అందరం క్షేమంగానే ఉన్నట్టు బలరాం తన భార్య శ్రీదేవికి మెసేజ్ పంపినట్టు తెలిసింది. ‘కిడ్నాపైన నలుగురిలో విజయ్ కుమార్, లక్ష్మీకాంత్ విడుదలయ్యా యని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. మిగతా ఇద్దరి విడుదల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం’ అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. విడుదలైన ఇద్దరు తిరిగి విశ్వవిద్యాలయానికి చేరుకున్నారని, అయితే వారు ఎలా బయటపడ్డారన్నది ఇంకా తెలియరాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. గోపీకృష్ణ హైదరాబాద్‌లోని నాచారం వాసి. గత ఏడేళ్లుగా ఆయన లిబియాలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఐఎస్ ఉగ్రవాదుల ఆధీనంలోని సిర్తే పట్టణానికి 50కి.మీ దూరంలోని ఒక చెక్ పాయింట్ వద్ద వీరిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘రెండు రోజుల క్రితం అంటే జులై 29, రాత్రి 11గంటల సమయానికి ట్రిపోలిలోని మన దౌత్య కార్యాలయానికి నలుగురు భారతీయులు కిడ్నాప్‌నకు గురైనట్లు సమాచారం అందింది. వారంతా సిర్తే విశ్వవిద్యాలయ అధ్యాపకులు’ అని వికాస్ స్వరూప్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో వ్యాఖ్యానించారు. బాధితుల కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఉగ్రవాదుల చెర నుంచి బాధితులను విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అదే విధంగా సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో ట్రిపోలిలోని భారత దౌత్యకార్యాలయం ఉందని, వారితో కూడా నిత్యం మాట్లాడుతున్నామని వికాస్ వివరించారు. ఉగ్రవాదుల డిమాండ్లపై ఇప్పటి వరకు సమాచారం లేదన్నారు. భారతీయులు అపహరణకు గురైన ప్రాంతం ఐఎస్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉందని పేర్కొన్నారు. ఇరాక్, సిరియా దేశాల్లోని అత్యధిక భూభాగాన్ని ఇప్పటికే నియంత్రణలోకి తీసుకున్న ఐఎస్ లిబియాలోనూ తన హవా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయులు ఆ దేశాన్ని విడిచి రావాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జులై మాసంలోనే హెచ్చరించింది. తాజా ఘటన అక్కడి భారతీయులతో పాటు ఇక్కడ ఉన్న వారి బంధువులను కలవరానికి గురిచేస్తోంది.

బాధితులను రక్షించేందుకు చర్యలు : వెంకయ్య
Two Indian teachers freed out of fourలిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌నకు గురైనట్లు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని, వారిని సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ కిడ్నాపైన వారిలో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నారన్నారు. ఈ విషయమై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడానని, వారిని కాపాడేందుకు ఆ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని వెంకయ్య పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ రాసింది. కిడ్నాప్‌నకు గురైన ఇద్దరు తెలుగు వారితో పాటు నలుగురు భారతీయులను సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఢిల్లీలోని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కె.రామ్మోహన్ రావు ఒక లేఖ రాశారు.
కేంద్రం కలుగుజేసుకోవాలి : గోపికృష్ణ కుటుంబం
లిబియాలో కిడ్నాప్ అయిన ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాం కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేద వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కలుగ జేసుకోవాలని, సురక్షితంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరారు.
లిబియాలో మా సోదరుడు కిడ్నాప్‌నకు గురైనట్లు సమాచారం అందిందని, అయితే అతని జాడ వివరాలు తెలియరాలేదని గోపికృష్ణ సోదరుడు మురళీకృష్ణ అన్నారు. అతని విడుదల కోసం కేంద్రం అత్యవసరంగా కలుగజేసుకోవాలని కోరారు. గోపికృష్ణ సిర్తే విశ్వవిద్యాలయంలో 2007 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని వివరించారు. జులై 29న తమకు ఫోన్ చేసి ట్రిపోలి నుంచి ట్యునీసియా మీదుగా భారత్ వస్తున్నట్టు చెప్పాడని అన్నారు. వీసా సమస్య కారణంగా ట్యునీసియాకు రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్నట్టు వివరించాడని తెలిపారు.
Kidnap_manatelangana1అయితే అదే రోజు రాత్రి కిడ్నాప్‌నకు గురైనట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. గోపాలకృష్ణ శ్రీకాకుళం జిల్లా వాసి. అయితే ఆయన సోదరుడు మురళీకృష్ణ హైదరాబాద్‌లోని నాచారంలో నివాసం ఉంటారు. ప్రతి ఏటా హైదరాబాద్ వస్తారని, ఈ సారి 45రోజులు ఇక్కడే ఉంటానని చెప్పాడని అన్నారు.