Home తాజా వార్తలు రెండో టెస్టుకు భారత జట్టు ప్రకటన!

రెండో టెస్టుకు భారత జట్టు ప్రకటన!

India lose by 60 runs, conceded series

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్‌ల మధ్య రెండో టెస్టు మ్యాచ్  శుక్రవారం నుంచి జరగనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్ కోసం సెలక్టర్లు భారత జట్టుని గురువారం ప్రకటించారు. మొదటి టెస్టులో ఆడిన 11 మందినే అలానే కొనసాగిస్తూ.. 12వ ఆటగాడిగా ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌ని తాజాగా జట్టులోకి ఎంపిక చేశారు. దీంతో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆంధ్రా క్రికెటర్‌ హనుమ విహారి, యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌‌కి నిరాశ తప్పలేదు.  రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి  టెస్టులో శతకం బాదిన యువ ఓపెనర్ పృథ్వీ షా తన స్థానాన్ని నిలబెట్టుకోగా, పరుగులేమి చేయకుండా నిరాశపరిచిన మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ కు సెలక్టర్లు ఇంకో ఛాన్స్ ఇచ్చారు. తొలి టెస్టులో భారత్, వెస్టిండీస్ జట్టుపై ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

 భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), కెఎల్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్.

Indian team declared to second Test with West indies