Home స్కోర్ ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఖరారు

ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఖరారు

BCCI-2ముంబయి: ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే తొలి రెండు టెస్టులకు బిసిసిఐ 15 మంది సభ్యులతోె కూడిన భారత జట్టును ఖరారు చేసింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌తోపాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు తొలిసారి టెస్టుల్లో అవకాశం కల్పించారు. ఈ నెల 9 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది.
జట్టు వివరాలు ఇలా ఉన్నాయి…
జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఆర్ అశ్విన్, గౌతమ్ గంభీర్, రవింద్ర జడేజా, అమిత్ మిశ్రా, మొహ్మద్ షమి, ఛటేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), కరుణ్ నాయర్, మురళి విజయ్, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్.