Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

Indian Techie Srinivas Kuchibhotla's killer sentenced to life imprisonment

న్యూయార్క్: అమెరికాలో ఇండియన్ టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్లను హత్య చేసిన ముద్దాయికి ఆ దేశ ఫెడరల్ కోర్టు జీవితఖైదు విధించింది. జాతివివక్షతో కాల్పులు జరిపిన ఆడమ్ ప్యూరింటన్‌కు జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. దీంతో 52 ఏళ్ల ప్యూరింటన్ జీవితమంతా జైళ్లోనే గడపనున్నాడు. మిడ్‌వెస్ట్రన్ ప్రాంతంలో గతేడాది ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్, అతడి స్నేహితుడు అలోక్ మదసాని కెన్సస్లోని ఒలేత్ నగరంలోని ఓ బార్‌లో ఉండగా ఆడమ్ మా దేశం నుంచి వెళ్లిపోండంటూ వారిద్దరిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా, అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డుకుబోయిన మరో అమెరికా వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి. న్యాయస్థానం తీర్పు అనంతరం శ్రీనివాస్ సతీమణి సునయన మాట్లాడుతూ… ఈ తీర్పుతో శ్రీనివాస్ తిరిగి రాకపోయిన ఇలాంటి ఘటనలు మునుముందు జరగకుండా చూడాలని సూచించింది. ఈ కేసులో తమకు అండగా నిలబడిన ఒలేత్ పోలీసులతో పాటు న్యాయస్థానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Comments

comments