Home అంతర్జాతీయ వార్తలు దుబాయి విమానాశ్రయంలో భారతీయురాలి ప్రసవం!

దుబాయి విమానాశ్రయంలో భారతీయురాలి ప్రసవం!

Born Babyదుబాయి: ఓ భారతీయ మహిళ దుబాయి విమానాశ్రయంలో ప్రసవించింది. నెలలు నిండడంతో ప్రసవవేదనతో బాధపడిన మహిళ దుబాయి విమానాశ్రయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణి ప్రసవవేదనతో బాధపడడం గమనించిన విమానాశ్రయంలో పనిచేసే హనన్‌ హుస్సేన్‌ మొహమ్మద్‌ అనే మహిళా అధికారి వెంటనే స్పందించి ఆమెను హుటాహుటిన తన ఇన్‌స్పెక్షన్‌ గదికి తరలించింది. అక్కడే ఇతర సిబ్బంది సహయంతో ప్రసవం అయ్యేలా చూసింది. అనంతరం తల్లీబిడ్డ ఇద్దర్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

Indian Woman Gives Birth At Dubai Airport