Search
Friday 16 November 2018
  • :
  • :

దేశాన్ని పరిపాలించే మీరు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు..?

Women-India-Cricket-Team

న్యూఢిల్లీ: భారత మహిళ క్రికెట్ జట్టు ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శనతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తృటిలో టైటిల్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న మహిళ జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. కాగా, ఈ నెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని భారత్ జట్టు కలిసినప్పుడు జట్టులోని కొంత మంది మహిళా క్రికెటర్లు ప్రధానిని సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారట.

వాటికి మోడీ కూడా అంతే సరదాగా సమాధానమిచ్చారట. ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన పూనమ్ రౌత్ మొదట ప్రధానికి… దేశాన్ని పరిపాలించే మీరు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు..? అని ప్రశ్నించగా.. ధ్యానం, యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించుకుంటానని సమాధానం ఇచ్చారట’.

ఆ తరువాత ఆసీస్ పై సెమీస్ లో భారీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ… ‘మీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా ఎవరినైనా డిజైనర్‌గా నియమించుకున్నారా..? అని ప్రశ్నించగా.. అహ్మదాబాద్‌లో ఒక టైలర్ ఉన్నాడని.. అతనే గత కొన్నేళ్లుగా తనకు కావాల్సిన దుస్తులను కుట్టిస్తుంటాడని సమాధానం ఇచ్చారని’ చెప్పుకొచ్చారు. ఈ సారి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మళ్లీ మీతో కలుస్తానని మోడీ చెప్పినట్లు మహిళా క్రికెటర్లు తెలిపారు.

Comments

comments