Search
Sunday 23 September 2018
  • :
  • :

టీమిండియా ఘోర పరాజయం

Indian Women Cricket Team Lost 2nd ODI Against England

నాగ్‌పూర్: వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి వన్డేలో అద్భుత విజయాన్ని సాధించిన టీమిండియా రెండో వన్డేలో చేతులేత్తేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది. ఇవాళ్టి మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఇంగ్లండ్ బౌలర్లు బెంబేలెత్తించారు. దాంతో 37.2 ఓవర్లలో టీమిండియా కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో స్మృతి మంధాన 42, దీప్తి శర్మ 26, దేవికా 11 మాత్రమే రెండంకెల స్కోర్ నమోదు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు సోఫీ ఎక్లెస్టోన్, హాజెల్ చెరో 4 వికెట్లతో టీమిండియాను కుప్పకూల్చారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 29 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెన్ ఛేదించింది. ఇంగ్లండ్ టీంలో వ్యాట్ 47, బీమౌంట్ 39, హీథర్ 26(నాటౌట్) పరుగులతో రాణించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.

Comments

comments