Search
Wednesday 17 October 2018
  • :
  • :

హాకీలో హ్యాట్రిక్ విజయం

Indian women hockey team third win at Youth Olympics

బ్యూనస్‌ఎయిర్స్: యూత్ ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. బుధవారం వనువతుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 160 గోల్స్ తేడాతో జయభేరి మోగించింది. ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టును కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఫార్వర్డ్ ముంతాజ్ ఖాన్ నాలుగు గోల్స్ సాధించింది. (8, 11, 12, 15నిమిషాల్లో) ముంతాజ్ గోల్స్ చేసింది. చేతన కూడా మూడు గోల్స్‌తో జట్టు ఘన విజయంలో తనవంతు పాత్ర పోషించింది. ఆట ఆరో నిమిషంలోనే చేతన గోల్ సాధించింది. ఆ తర్వాత 14, 17 నిమిషాల్లో కూడా చేతన గోల్స్ నమోదు చేసింది. కాగా, రెండో నిమిషం నుంచే భారత్ తన గోల్స్ వేట ప్రారంభించింది. లాల్‌రేమ్‌సియామి జట్టుకు తొలి గోల్ అందించింది. ఆ వెంటన రీత్ గోల్ చేసింది. కొద్ది సేపటికే కెప్టెన్ సలీమా మూడో గోల్ సాధించి పెట్టింది. తర్వాత భారత్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది వరుసగా మూడో గెలుపు కావడం విశేషం.

Comments

comments