Home స్కోర్ ఆసియా కప్ ఫైనల్ : పాక్‌పై భారత్ ఘనవిజయం

ఆసియా కప్ ఫైనల్ : పాక్‌పై భారత్ ఘనవిజయం

Indian-Women-Teamబ్యాంకాక్ : ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 17 పరుగుల తేడాతో మిథాలీ సేనా గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. 122 పరుగుల విజయ లక్షంతో బరిలోకి దిగి పాక్ ఆరు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో విజయం భారత్ సొంతమైంది. లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన భారత్.. ఫైనల్‌లో కూడా పాక్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.