Home అంతర్జాతీయ వార్తలు విదేశాల్లో భారతీయ ఉద్యోగుల అష్టకష్టాలు

విదేశాల్లో భారతీయ ఉద్యోగుల అష్టకష్టాలు

kidnap2సర్కారుకు సవాల్‌గా మారుతున్న కిడ్నాప్ ఘటనలు
మన తెలంగాణ/ హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే భారత యువత ఇక ముందు ఒకటికి వందమార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం అంతర్యుద్ధం, ఉగ్రవాద ప్రాభల్యంతో రగిలిపోతు న్న అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారగా, ఆయా ప్రాంతాలలోని ఉగ్రవాదులు తరచు భారత్‌కు చెందిన వారిని టార్గెట్ చేస్తుండడం కేంద్రానికి పెనుసవాల్‌గా మారింది. ఉగ్రవాద సమస్యలతో పెను సంక్షోభంలో వున్న దేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే వారు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం పదే పదే సూచి స్తోంది. అయినా కన్సల్టెన్సీ కంపెనీల మాయజాలంలో పడుతున్న నిరుద్యోగులు ఆయా దేశాలకు వెళుతూ సమ స్యల్లో చిక్కుకుంటున్నారు. లిబియాలోని సిర్డ్‌లో ఇద్దరు తెలుగువారి కిడ్నాప్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపగా, వారం రోజులు కావస్తున్నా ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

భారత్‌కు చెందిన లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లడం చాలా కాలంగా జరుగుతున్న విషయమే. గతంలో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగా లంటే మోజు ఎక్కువగా వుండేది. అయితే దశాబ్ద కాలంగా గల్ఫ్ దేశాల్లో పరిస్థి తులు తారుమారు కావడం తో అక్కడకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది. అయిన ప్పటికీ కన్సల్టెన్సీ కంపెనీల మాయ మాటలు నమ్ము తూ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లి దీనంగా బతుకు వెళ్లదీస్తున్న లక్షలాది మంది భారతీయు ల గురించి మీడియాలో నిత్యం కథనాలు వస్తూ నే వున్నాయి. అలాగే కొంత ఎక్కువగా జీతాలు వచ్చే అవ కాశాలున్న ఇంకొన్ని దేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లే యువత ఇటీవల కాలం లో బాగా పెరిగింది.

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్, ఈజిప్టు, యెమెన్, నైజీరియా అల్జీరియా, కాంబో డియా, లిబియా, సిరియా, సుడాన్‌లతో పాటు ఆఫ్రికాలోని మరికొన్ని దేశాలకు వెళ్తున్నారు. ఈ దేశాల్లో భారతీయుల సంఖ్య కూడా ఎక్కువ గానే వుంటోందని విదేశాంగ శాఖ వద్ద వున్న వివరాలు చెబుతున్నాయి. చదువు కున్న, చదువురాని కూడా వెళ్తు న్నారు. చదువుకున్న వారికి వారి విద్యార్హతలను బట్టి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుండగా, చదువురాని వారు ఆయా దేశాల్లో ఉగ్రవాదులను ఏరివేసే విధుల్లో వుండే భద్రతా బలగాలకు రక్షణగా వుండాల్సి వుంటోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్మాణ రంగంలో ఇంజినీర్‌గా వెళ్లిన కుషా యిగూడకు చెందిన సూర్య నారాయణ రాజును తాలిబన్లు కిడ్నాప్ చేసి, డబ్బులు తీసు కున్న తరువాత కూడా తల నరికి చంపడం పాశవిక ఘటనగా చెప్పాలి. భారత విదేశాంగ కార్యాలయంపైనా, భారతీయులు వుండే నివా సాలపైనా తాలిబన్లు అనేకమార్లు దాడులు జరపడం గమనార్హం.

ఆఫ్ఘనిస్తాన్ విషయం అలావుంచితే ఇటీవల కాలంలో అంత ర్యుద్ధంతో రగిలిపోతున్న పలు గల్, ఆఫ్రికా దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉద్యోగాలు నిర్వహిస్తుండడం కేంద్రానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. రెండు నెలల క్రితం యెమెన్, లిబియాలలో తలెత్తిన అంత ర్యుద్ధం వల్ల వేలాది మంది భారతీ యులను కేంద్రం ప్రత్యేక ఆపరేషన్ ద్వారా విమానాలు, ఓడలద్వారా తరలించడం తెలిసిందే. లిబియా, యెమెన్ దేశాల్లో వున్న భారతీయుల్లో అనేక మందిని కేంద్రం ఇటీవలే వెనక్కి రప్పించినా తాజాగా లిబియాలోని సిర్ద్ పట్టణంలో నలుగురు భారతీయ అధ్యాపకులను ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల కాలంలో అనేక మందిని కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చెరలో వున్న తెలుగువారి గురించి ఆందోళన మరింత పెరుగుతోంది.

సంక్షోభ దేశాల్లో ఉద్యోగాలకు వెళ్లవద్దు : కేంద్రం స్పష్టీకరణ
ఇదిలా వుండగా విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్న నిరుద్యోగులకు కేంద్ర విదేశాంగశాఖ కొత్త మార్గదర్శ కాలను జారీ చేసింది. అల్ ఖైదాతో పాటు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద ప్రభావిత దేశాలు, అంతర్యుద్ధంతో రగిలి పోతున్న దేశాల్లో ఎలాంటి ఉద్యోగాలకు వెళ్లరాదని భారతీయ నిరుద్యో గులకు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారీ జీతాలకు ఆశపడి వెళ్తున్న వారు ఆనక అక్కడ ప్రమాదాల్లో చిక్కుకుని ఇబ్బందుల్లో పడడం మంచిది కాదని విదేశాంగశాఖ హెచ్చరించింది. కన్సల్టెన్సీ కంపెనీల మాయాజాలంలో పడరాదని, అన్ని అంశాలను ముందుగానే పరిశీలించుకోవాలని కూడా పేర్కొంది.