Search
Sunday 18 November 2018
  • :
  • :

సౌదీలో చిక్కుపడ్డ భారతీయులకు తిరిగివచ్చే చివరి ఛాన్స్ 25

sushma-swaraj-image-doneన్యూఢిల్లీ/దుబాయ్: సౌదీ అరేబియాలో ఉద్యోగాలు పోయి, చిక్కుపడ్డ భారతీయ కార్మికులను వచ్చే నెల 25 వరకూ తిరిగి స్వదేశం తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వారి ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. సౌదీలో బాధలు పడుతున్న ఇలాంటి కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వచ్చే నెల 25లోగా తిరిగి వచ్చేందుకు సిద్ధపడాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. ఒకవేళ ఈ గడువులోగా రాని వారు ఆ తరువాత సొంత ఖర్చులతో తిరిగి రావాల్సి ఉంటుంది. అప్పటివరకూ తమ వసతి, భోజన ఖర్చులను భరించుకోవల్సి ఉంటుంది. సౌదీలో పలు రకాల పనులకు, ఉద్యోగాలకు వెళ్లిన భారతీయులు అక్కడి కంపెనీల నుంచి సరైన జీతాలు అందక రోడ్డున పడ్డారు. వాటిలో పలు కంపెనీలు మూతపడ్డాయి. దీనితో కార్మికులకు రావల్సిన బకాయిలను తిరిగి ఇప్పించేందుకు సమయం పడుతుందని సౌదీ ప్రభుత్వం భారత్‌కు తెలిపింది. సౌదీలో తమ బకాయిలను రాబట్టుకోవచ్చుననే ఆశతో ఉంటే పలు ఇతర సమస్యలు రావడం తప్ప మరోటి ఉండదని, భారత ప్రభుత్వం కల్పిస్తోన్న అవకాశాన్ని వినియోగించుకుని ఈ గడువులోగా తిరిగి రావడానికి ముందుకు రావాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చా రు. సౌదీలో ఆర్థిక మాంద్యం కారణంలో పలు కంపెనీలు మూతపడుతూ వస్తున్నాయి. చమురు ధరలు తగ్గిపోవడం, ప్రభుత్వం వ్యయంలో కోతలు విధించడంతో వేలాది మంది భారతీయ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Comments

comments