Home స్కోర్ దీపక్‌కు స్వర్ణం

దీపక్‌కు స్వర్ణం

Indian wrestler Deepak Poonia won the gold

న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ దీపక్ పూనియా స్వర్ణం సాధించాడు. రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో భారత యువ రెజ్లర్ దీపక్ 86 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పోటీలో దీపక్ తుర్కమినిస్థాన్ రెజ్లర్ అజత్‌ను ఓడించాడు. మరోవైపు 74 కిలోల విభాగంలో సచిన్ రాఠి స్వర్ణం గెలుచుకున్నాడు. ఫైనల్లో సచిన్ మంగోలియా రెజ్లర్‌పై విజయం సాధించాడు.