Search
Wednesday 26 September 2018
  • :
  • :

వట్టి చేతులతోనే..

Wrestlingలాస్‌వేగాస్ : ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఈసారి భారత రెజ్లర్లు పతకాలు సాధించడంలో విఫలమయ్యారు. టోర్నీ ఆరంభం నుంచే నిరాశపరుస్తూ వచ్చిన రెజ్లర్లు చివరి రోజూ పతకం లేకుండానే ముగించారు. టోర్నీ చివరి రోజు బరిలోకి దిగిన అర్జున అవార్డు గ్రహిత బజరంగ్(61కేజి), నరేశ్ కుమార్(86కేజి), మౌసమ్ ఖత్రి(97కేజి) పతకాల రౌండ్‌కు అర్హత సాధించలేకపోయారు. ప్రీస్టయిల్ 61 కేజిల విభాగంలో తలపడిన బజరంగ్.. క్వాలిఫికేషన్ రౌండ్లో 0-10తో బట్బోడ్ నోమిన్(మంగోలియా) చేతిలో ఓడినా.. బట్బోడ్ ఫైనల్‌కు చేరడంతో రెప్‌చేజ్‌లో కాంస్యం గెలిచే అవకాశం వచ్చింది. అయితే రెప్‌చేజ్‌లో 6-13తో రీస్ వెల్సీ(అమెరికా) చేతిలో ఓడిన బజరంగ్ పతక అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఖత్రి కూడా రెప్‌చేజ్‌లో 5-6తో ఓడగా స్టీఫెన్ కెర్కెర్(జర్మనీ), క్వాలిఫికేషన్ రౌండ్లో నరేశ్ 0-10తో లుకాస్(స్విట్జర్లాండ్) చేతిలో ఓడాడు.

Comments

comments