Home ఎడిటోరియల్ అవార్డులు ‘అసహనం’కు గురవుతున్నాయి

అవార్డులు ‘అసహనం’కు గురవుతున్నాయి

awardsనిలిచి వెలిగే ‘జ్ఞానం’ ముందు అవార్డులు, రివార్డులు వచ్చి వాలడం సహజం. అవార్డులు ‘అసహనం’కు గురైనప్పుడు తిరిగి వెళ్లిపోవడం అంతే సహజం. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. స్వేచ్ఛ, స్వచ్ఛతతో కూడిన భావాలతో లౌకిక సమాజాన్ని కాంక్షిస్తున్న రచయితలపై మోదీ ప్రభుత్వం చేస్తున్న దాడులకు నిరసనగా సుమారు యాభై మంది రచయితలు, శాస్త్రవేత్తలు, సామాజికవాదులు తమ తమ అవార్డులను వెనక్కి ఇచ్చివేశారు. సమాజంలో పెరుగుతున్న మతపరమైన అసహనం, భావప్రకటన స్వేచ్ఛపై దాడులకు వ్యతిరేకంగా ప్రముఖ సాహిత్య కారుల నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. దాద్రీ ఘటన, హేతువాదులు కల్బుర్గి, ధబోల్కర్, పన్సారేల హత్య, సుధీంద్ర కులకర్ణిపై శివసేన దాడి… ఘటనలపై నిరసనగా తామందు కున్న పురస్కారాలను తిరిగి ఇస్తూ దేశ చరిత్రలో ‘సాహిత్య సునామీ’ చోటుచేసుకుంది. రచయిత కె.ఎస్. భగవాన్‌ను చంపేస్తామని ఫోన్‌కాల్స్ ద్వారా బెదిరించడం, బీఫ్ తింటామన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే చంపేస్తామని హెచ్చ రించడం, తెలంగాణలో కవి, ప్రొ. కంచ ఐలయ్యపై కేసులు నమోదు చేయడం, గొడ్డు మాంసం తినడాన్ని సమర్థిస్తూ, హిందూ ఆచారా లను ప్రశ్నించిన కన్నడ రచయిత్రి చేతనా తీర్థహళ్లికి బెదిరింపులు రావడం, టిప్పు సుల్తాన్ జయంతిని అడ్డుకోవటం, టిప్పును సమర్థించిన సుప్రసిద్ధ నాటక రచయిత గిరీష్ కర్నాడ్‌కు హత్యా బెదిరింపులు… ఈ సంఘటనలు 21వ శతాబ్దాన్ని ఎటువైపుకు తీసికెడు తున్నారని ప్రశ్నిస్తున్నాయి. అయితే, ఈ ప్రశ్నకు బీహార్ ఎన్నికలు గట్టి జవాబే ఇచ్చాయి. ‘అసహనం’పై సహనం ఘన విజయమని ఈవీఎం లు బహిరంగం గా చాటిచెప్పాయి. సమాజ పురో గామి శక్తులు హిందుత్వ శక్తుల పట్ల చూపెడుతున్న ఉదాసీన వైఖరి కారణంగానే ఇంతటి ఉపద్రవం వచ్చిపడిందని అనుకున్నా, ఎన్నికలు ఇందుకు ధీటైన సమాధాన మిచ్చాయి.
వ్యక్తి ప్రతిభను గుర్తించి అందించిన సాహిత్య అకాడమీ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్ పుర స్కారాలు ఒకటొకటిగా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నా యి. ఇప్పటికిప్పుడు యాభై మంది వరకు అవార్డు లు, పురస్కారాలను తిరిగి ఇచ్చివేశారు. తెలుగు, కశ్మీర్, కన్నడ, హిందీ, మరాఠీ,అస్సాం, పంజాబ్ లతో పాటు ఢిల్లీ రంగస్థల నటి మాయా క్రిష్ణారావ్ సంగీత నాటక అకాడమీ అవార్డును వెనక్కిచ్చారు. వీరంతా కూడా మైనారిటీలకు ఈ దేశంలో రక్షణ కరువైందని వాపోయారు. భవిష్యత్ అంధకార మైందన్న ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్య లు, బూటకపు ఎన్‌కౌంటర్లు, నిరుద్యోగాన్ని ప్రభు త్వాలు పెంచి పోషిస్తున్నాయన్నారు. కలం నుంచి అక్షరాల బుల్లెట్లను కురిపించాల్సి ఆవశ్యకతను వారు నొక్కి చెప్పారు. పంజాబీ రచయిత్రి దాలిప్ కౌర్ తన పద్మశ్రీ పురస్కారాన్ని, ప్రముఖ రచయిత, నటుడు ఎం.భూపాల్‌రెడ్డి తనకు వచ్చిన అవార్డులన్నీ ఇచ్చేశారు.
మత విద్వేషాలు పెరగడంపై ప్రముఖ కవి, పాటల రచయిత గుల్జార్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. మునుపెన్నడూ ఇలాంటి సంఘటనలు చూడ లేదన్నారు. అవార్డులు వెనక్కు ఇవ్వడం ద్వారా తమ నిరసనను తెలియజేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రముఖ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అహ్మద్ అలీఖాన్, నటి షబానా ఆజ్మీ, షర్మీలా టాగోర్‌లు భిన్నతంలో ఏకత్వం దాగిన భారత్‌లో కళాకారులపై దాడులు జరగడం బాధాకరమైన సంఘటనగా ఆవేదన వ్యక్తం చేశారు. రచయితల ఆందోళనకు మద్ధతుగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి తోడుగా మరిన్ని బిజినెస్ గొంతులు కలపడం విశేషం. అవార్డులు తిరిగి పంపి స్తున్నవారికి సినీరంగ ప్రముఖులు కూడా తోడ య్యారు. ప్రముఖ చిత్ర నిర్మాతలు సయీద్ మీర్జా, సినిమాటోగ్రాఫర్ వీరేంద్ర సైనీతో పాటు 24 మంది తమ జాతీయ పురస్కారాలను వెనక్కి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రచయితలు, కళాకారులు, సినీ ప్రముఖుల కోవలో శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కూడా చేరారు. భారతదేశంలో అసహన వాతా వరణం పెచ్చుమీరుతోందని, దీన్ని నియంత్రించ టానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ విధమైన హామీ ప్రకటన చేయకపోవడాన్ని నిరసిస్తూ 58 మంది ప్రముఖ చరిత్రకారులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, సీసీఎంబి వ్యవస్థాపక డైరెక్టర్ పీఎం భార్గవ ఏకంగా తనకు వచ్చిన ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. రచయిత్రి నయనతార సెహెగల్ సహా 41 మంది రచయితలు, కళాకారులు సాహిత్య అడమీకి లేఖరాస్తూ, రాజ్యాంగ స్ఫూర్తి అమలుజరుగుతోందా అని ప్రశ్నించారు. ఎవరి హక్కులు భంగం వాటిల్లకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే నని స్పష్టం చేశారు. ప్రఖ్యాత రచయిత్రి, హక్కుల కార్యకర్త అరుంధతీ రాయ్ తన స్క్రీన్‌ప్లేకు వచ్చిన అవార్డును తిరిగి ఇచ్చేస్తూ, అవార్డుల్ని వెనక్కి ఇవ్వడ మనేది విద్వేష భావజాలానికి వ్యతిరేకంగా నిరుప మాన రాజకీయ ఉద్యమని ప్రకటించగా, బుకర్ అవార్డు గ్రహీత సల్మాన్ రష్డీ పురస్కారాలను వెనక్కి ఇచ్చిన రచయితలకు మద్దతు తెలిపారు. రచయి తలు, మేధావులపై హత్యలు, దాడులు జరుగుతున్న తీరు దేశం అసహన సమాజంవైపు వొరుగు తున్న ట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో నెల కొని ఉన్న ఈ పరిస్థితికి ‘అస హనం’ అనేది చిన్న మాటే. తోటి మనుషులను కొట్టి చంపడం, సజీవ దహనం చేయడం, బుల్లెట్లతో చంపడం ఘోరమైన అతిపెద్ద దారుణం. ఏం జరుగ బోతున్నదో అర్థం చేసుకోవ డానికి మన కళ్ల ముందు లెక్కలేనన్ని ముందస్తు సూచనలు కనిపి స్తాయి. కాబట్టి, బిజెపి ప్రభుత్వానికి భారీ మెజారిటీ కట్టబెట్టి గెలిపించిన ఏడాదిన్నర కాలంలో జరిగిన బీహార్ ఎన్నికల ఫలితాలను బేరీ జు వేసు కోవాలి. ఢిల్లీ. బీహార్ లలో బిజెపిని భారీ మెజారిటీతో వెనక్కి నెట్టి వేయడం, ప్రజలు ఏమేరకు ‘అసహనం’కు గుర య్యారో పాలకులు అర్థం చేసు కోవాలి. జీవిం చడం నరకప్రాయంగా మారుతుం దని గుర్తించిన ప్రజలు ఎప్పటికప్పుడు అనూహ్య మైన ఫలితాలు అందిస్తూనే ఉంటారని గమనించాలి. ఆవు చనిపోతే చట్ట వ్యతి రేక వధగా గుర్తిస్తున్నప్పుడు, మనిషిని హత్య చేయా లని ఏ చట్టం చెబుతుందో వివరణ కావాలిప్పుడు. – 9848992825