Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

న్యూయార్క్ రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృతి

Accidentన్యూయార్క్ : అమెరికా పర్యటనకు వెళ్లిన భారత్ కు చెందిన ఓ కుటుం బాన్ని మృత్యువు కబళిం చింది. 38ఏళ్ళ ఓ భార తీయుడు,అతని కుటుంబసభ్యులు న్యూయార్క్‌లో ఓ వాహనంలో ప్రయాణం చేస్తుండగా మద్యం మత్తులో ఉన్న ఓ లారీ డ్రైవర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘోర ప్రమాదంలో ఆ కుటుంబ సభ్యులంతా దుర్మ రణం చెందారు. యఫాంక్ మధ్య ద్వీపం రోడ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటనలో చందన్ గవాయ్, అతని తల్లిదండ్రులు అర్చన గవాయ్ (60), కమలనాయన్ (74) మరణించారు. అదే విధంగా లారీ ట్రైవర్ గుత్సవ్ గేయెర్ కూడా మృతి చెందాడు. గేయెర్ పరిమితికి మించి రెండు రెట్లు ఎక్కువగా మద్య సేవిచండంతో ఈ ప్రమాదం వాటిల్లినట్లు సిబిఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఘటనా స్థలిలోనే అర్చన, కమలనాయన్, గేయెర్ చనిపోగా, చందన్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ప్రమాదం అనంతరం రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో చందన్ భార్య కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తలకు కూడా బలమైన గాయాలయ్యాయి. వీరికి 11 నెలల కూమారుడు కూడా ఉన్నాడు. స్వల్ప గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్నాడు. బాలుడి సంరక్షణ బాధ్యలు తీసుకునేందుకు, మృతుల అంత్యక్రియలు చేసేందుకు వారి కుటంబ సభ్యులు ఈ వారంలో న్యూయార్క్ వెళ్లే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా, మద్యం మత్తులో ఉ్నన లారీ డ్రైవర్ గేయెల్ వాహనంపై నియ ంత్రణ కోల్పోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు వివరించారు.

Comments

comments