Home తాజా వార్తలు రూపాయి @70.32

రూపాయి @70.32

India's currency, which is further weakened with dollar

డాలర్‌తో మరింతగా క్షీణించిన భారత్ కరెన్సీ

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకీ క్షీణిస్తూ వస్తోంది. ఇది గురువారం 70.32కు రూపాయిఇ విలువ పడిపోయింది. ఇప్పటికే డాలర్‌పై 70 దాటిన రూపాయి మరింతగా క్షీణిస్తూ వస్తోంది. తాజాగా డాలరుతో మారకంలో రూపాయి విలువ 43 పైసలు పతనమైంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభంలోనే 70.32 వరకు క్షీణించింది. ఫలితంగా రూపాయి మళ్లీ చరిత్రాత్మక కనిష్ట రికార్డును నమోదు చేసింది. అయితే రూపాయి త్వరలో కొలుకునే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. టర్కీలో ఆర్థిక మాంద్యం కారణంగా డాలర్ విలువ 13 నెలల గరిష్ఠానికి చేరుకోవడంతో ఆసియా దేశాల కరెన్సీలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు సరిపడినంతగా ఉన్నాయని, రూపాయిలో ఎలాంటి అనిశ్చితి ఏర్పడినా చర్యలు చేపడతామని బుధవారం ప్రభుత్వం అభయమిచ్చింది. అయితే రూపాయి పతనం మాత్రం రోజు రోజుకీ పెరుగుతూ టర్కీ కరెన్సీ లిరా భారీ పతనం ఆ దేశ జులైలో వాణిజ్య లోటు ఐదేళ్ల గరిష్టానికి చేరడం వంటి ప్రతికూలతలతో రూపాయిపై ప్రభావ పడింది. గత రెండు రోజులుగా రూపాయి సరికొత్త కనిష్టాలకు పతనమవుతూ వస్తోంది. బుధవారం బులియన్ మార్కెట్‌కు సెలవు, మంగళవారం ఆర్‌బిఐ జోక్యంతో రూపాయి స్వల్పంగా 2 పైసలు బలపడి 69.89 వద్ద నిలిచింది. మొత్తానికి ఈ ఏడాది రూపాయి 9 శాతం దిగజారింది. మంగళవారం డాలరుతో మారకంలో చరిత్రలో తొలిసారి రూపాయి 70 మార్క్ దిగువకు చేరింది. ఫారెక్స్ మార్కెట్లో ఒక దశలో 70.08 వరకు క్షీణించింది.
వర్ధమాన దేశాల కరెన్సీలు కూడా..

వర్ధమాన దేశాల కరెన్సీలు పతనమవుతున్నాయి. టర్కీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు అస్థిరతకు గురవుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు తాజాగా 13 నెలల గరిష్టం 96.75కు చేరింది. బుధవారం ఒక దశలో 96.98 వరకూ ఎగసింది. ప్రెసిడెంట్ టయ్యిప్ ఎర్డోగన్ ఆర్థిక వ్యవస్థపై నియంత్రణలు పెంచడం, అమెరికాతో దౌత్యపరమైన వ్యతిరేకతలు ఏర్పడటం వంటి పలు ప్రతికూల అంశాల కారణంగా టర్కీ ఆర్థిక సంక్షోభంవైపు అడుగులేస్తోంది. దీంతో యూరో సహా పలు కరెన్సీలు దెబ్బతింటున్నాయి. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, సబ్సిడీల అమలుపై చైనా ప్రభుత్వం వరల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్లుటిఒ)కు ఫిర్యాదు చేసింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడంతో టర్కీ ప్రభుత్వం అమెరికన్ ఎలక్ట్రానిక్ వస్తువులను బహిష్కరించింది. అంతేకాకుండా మరికొన్ని ప్రొడక్టులపై దిగుమతి సుంకాలను 100 శాతం పెంచింది. కాగా.. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న టర్కీ దిగుమతులపై టారిఫ్‌లను తొలగించేందుకు అమెరికా ప్రభుత్వం తాజాగా విముఖత ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దౌత్యపరమైన విభేదాలే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

1 రూపాయి రికార్డు స్థాయి కనిష్ఠం 70.25 వద్ద ప్రారంభించింది. అనంతరం మరింతగా 43 పైసలు పతనమై చారిత్ర కనిష్టం 70.32 వద్దకు చేరింది. గురువారం ఉదయం 9.13 నిమిషాలకు డాలర్‌పై రూపాయి 70.25కు పడిపోగా, అంతకుముందు మంగళవారం 69.90 వద్ద ముగిసింది. బుధవారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ట్రేడింగ్ జరగలేదు.

2 రూపాయి భారీ పతనం వల్ల వాణిజ్య లోటు ఐదేళ్ల గరిష్ఠానికి చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనంతో వాణిజ్య లోటు మరింత ఆందోళన కలిగిస్తోందని ఆనంద్ రతి షేర్, స్టాక్ బ్రోకర్ రీసెర్చ్ అనలిస్ట్ రుషభ్ మారు అన్నారు. టర్కిష్ లిరా కోలుకున్నా డాలర్ మాత్రం పైపైకి దూసుకెళ్తోందని, అంతర్జాతీయ మార్కెట్లు నిలకడ స్థితికి చేరుకుంటే రూపాయి పుంజుకునే అవకాశముందని అన్నారు. వచ్చే సెషన్లలోనూ రూపాయి ఒత్తిడిని ఎదుర్కొనవచ్చని అన్నారు.

3 జూలై నెలకు గాను వాణిజ్య లోటు 18.02 బిలియన్ డాలర్లతో ఐదేళ్ల గరిష్ఠానికి చేరింది. చమురు దిగుమతులు పెరగంతో ఈసారి లోటు పెరిగింది.

4 రూపాయి కోలుకున్నప్పటికీ అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా దీర్ఘకాలంలో ఇలాగే కొనసాగకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

5 దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పటిష్ఠంగా ఉందని ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. దేశీయ కరెన్సీ పతనంతో పెట్టుబడులపైనా ప్రభావం చూపుతోంది.

6 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను పెంచడంతో ఇప్పటికే రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే టర్కిష్ లిరా పతనం ఇతర దేశాల కరెన్సీలపై ప్రభావం చూపుతోంది.

7 రూపాయి విలువ చారిత్రక కనిష్ఠానికి చేరడంతో బుధవారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. టర్కీలో ఆర్థిక సంక్షోభం కారణంగా వర్ధమాన దేశాల కరెన్సీలు వతనం వంటి పరిణామాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, అంతర్జాతీయ పరిస్థితులు మరింత విషమిస్తే జోక్యం చేసుకునేందుకు సిద్ధం ఉందన్నారు. ఒకవేళ కరెన్సీ మార్కెట్‌లో ఎలాంటి అస్థిరత ఏర్పడినా ఆ తీవ్రత తగ్గించడానికి భారత్‌కు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని జైట్లీ తెలిపారు.

8 రూపాయి జీవితకాల కనిష్టం తర్వాత మంగళవారం 69.90 వద్ద ముగిసింది.