Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ఇండియా ఫస్ట్ పిఎం ఎవరో మీకు తెలుసా..?

Modi-image

డిల్లీ: గూగుల్ సెర్చ్ ఇంజన్ గురువారం తన నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ఎంటీ ఆ షాక్ అనుకుంటున్నారా..? ఇండియాకి ఫస్ట్ పిఎం అని కొడితే ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో చూపిస్తుంది.  కానీ ఫోటో పక్కన మాత్రం జవహర్ లాల్ నెహ్రూ సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి. పోటోలు మాత్రం మారిపోయాయి. ఫస్ట్ పిఎం అనే కాదు ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ అని సెర్చ్ చేస్తే అరున్ జైట్లీ, నిర్మాలా సీతారామన్ పోటోలు వస్తున్నాయి. పక్కన మాత్రం నెహ్రూలాగే షణ్మఖం షెట్టి, బల్ దేవ్ సింగ్ అని సరైన వివరాలే కనిపిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు పరిషాన్ అవుతున్నారు. ట్విట్టర్ లో గూగుల్ ను ట్యాగ్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు సమస్య ఎంటనీ వాళ్లు ప్రశ్నించారు. కిల్లర్ ఫీచర్ అసోసియేట్ ఎడిటర్ ఇవాన్ మెహతా  మాట్లాడారు. గూగుల్ సెర్చ్ లో వికిపిడియాలో ఆర్టికల్స్ ను ఫస్ట్ రిజల్ట్ గా చూపిస్తున్నా వాటి ఫోటోలు మాత్రం తాజా మంత్రులవి వస్తున్నాయని తెలిపారు. దీనికి గూగుల్ సంస్థ పరిష్కరించాలని కోరారు.

Comments

comments