Home ఆఫ్ బీట్ ‘బాహుబలి’ బైక్.. పొడవెంతో తెలుసా?

‘బాహుబలి’ బైక్.. పొడవెంతో తెలుసా?

India’s longest chopper motorcycle is a 13-foot long designed by Zakir Khan

బెంగళూరు: యువతలో బైక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ కొత్త మోడళ్లు మార్కెట్లో వచ్చిన ఒక్కసారైన దాన్ని రైడ్ చేస్తే బాగుటుందనుకునే కుర్రకారు లేరంటే అతిశయోక్తి కాదు. వేగవంతమైన బైక్ లపై మేఘాలలో తేలిపోతూ దూసుకుపోవావాలనుకుంటారు. ఇక బైక్‌లపై అమిత ఆసక్తి ఉన్న బెంగళూరుకు చెందిన ఇంటీరియల్ డిజైనర్ జాకిర్ ఖాన్ అనే యువకుడు ఏకంగా 13 అడుగుల పొడవైన  బైక్‌ను రూపొందించాడు. అంతేకాదండోయ్ దీనికి ‘చాపర్ బైక్’ అనే పేరు కూడా పెట్టాడు.

World's-Lognest-Bike

ఇక బైక్ నిర్మాణం విషయానికి వస్తే… ఈ వన్ సీటర్ బైక్ తయారు చేసేందుకు రూ. 7.50 లక్షల వ్యయంతో పాటు 45 రోజులు పట్టాయట. దీనికి అవెంజర్ ద్విచక్రవాహనానికి సంబంధించిన 220 సిసి ఇంజిన్ అమర్చినట్లు తెలిపాడు. అలాగే 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, వెనకవైపు జీపు టైర్ అమర్చాడు. బైక్ బరువు 450 కేజీలు ఉండటంతో లీటర్ కు 7 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వడంతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట. ఈ భారీ బైక్ తయారీలో మొదట చాలాసార్లు ఫెయిల్యూర్స్ వచ్చిన, ఎంతో కష్టపడి దీన్ని రూపొందించినట్లు వివరించాడు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన బైక్ అని జాకిర్ చెబుతున్నాడు.