Home తాజా వార్తలు కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు పతకాల పంట

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు పతకాల పంట

India’s Medals Tally in Commonwealth Games 2018గోల్డ్ కోస్ట్: 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇండియా ఖాతాలో ఆదివారంనాడు ఏకంగా ఐదు పతకాలు చేరడం విశేషం. నాల్గో రోజు వెయిట్‌ లిఫ్టింగ్‌ 69కిలోల విభాగంలో పూనమ్‌ యాదవ్‌ పసిడి పతకం గెలిచి సత్తాచాటగా, పురుషుల 94కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో వికాస్‌ ఠాకుర్‌ కాంస్యపతకం కొల్లగొట్టాడు. అలాగే 10 మీటర్ల మహిళల ఏయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనూ భాకర్‌ స్వర్ణం గెలిచింది. ఇదే విభాగంలో హీనా సిద్ధు రజత పతకం గెలిచారు. 10 మీటర్ల పురుషుల ఏయిర్‌ పిస్టల్‌ విభాగంలో రవికుమార్‌ కాంస్యం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలో ఇప్పటీ వరకు మొత్తం 11 పతకాలు చేరాయి. వీటిలో 6 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యపతకాలు ఉన్నాయి. ఇక పతకాల పట్టికలో ఇండియా 4వ స్థానంలో ఉంది. కాగా, వీటిలో 8 పతకాలు వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలోనే రావడం విశేషం.