Search
Sunday 23 September 2018
  • :
  • :

సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ రిటైర్మెంట్

Somdev-Devvarman

చెన్నై: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. నూతన సంవత్సరం తొలి రోజే అభిమానులకు పెద్ద షాకిచ్చాడు. తాను టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 2017ను కొత్తగా ప్రారంభిస్తున్నానంటూ… ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. ఇన్నేళ్లుగా నన్ను ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు అని ట్వీట్ చేశాడు.

2008లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించిన సోమ్‌దేవ్ 2011లో కెరీర్ బెస్ట్ 62వ ర్యాంక్ సాధించడం విశేషం. 2009లో చెన్నై ఓపెన్ ఫైనల్ చేరడంతో కెరీర్‌లో తొలి ఎటిపి టూర్ ఫైనల్ చేరి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో అతను కార్లోస్ మోయో, ఇవో కార్లోవిచ్‌లాంటి స్టార్లను కూడా ఓడించాడు. అయితే తరుచూ గాయాలు కావడం ఆయన కెరీర్‌ను ఇరకాటంలో పడేసింది. 2011లో సోమ్‌దేవ్‌ను భారత ప్రభుత్వం క్రీడా అత్యున్నత పురస్కారం అర్జున అవార్డులో సత్కరించింది.

Comments

comments