Home తాజా వార్తలు వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు స్వర్ణం

వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు స్వర్ణం

Commonwealth-Games

గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం వచ్చింది. 48 కిలోల మహిళా విభాగంలో చాను సోయిఖోమ్ మిరాబాయి స్వర్ణ పతకం గెలుపొందింది. మిరాబాయి 86 కిలోల బరువును ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచింది. వెయిట్ లిఫ్టింగ్ లో 56 కేజీల పురుషుల విభాగంలో గురురాజా రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే. 21 వ కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి.