Home తాజా వార్తలు రికార్డు సృష్టించిన మహిళల జట్టు

రికార్డు సృష్టించిన మహిళల జట్టు

inwmns
కేప్‌టౌన్: 5వ టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 54 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో 5 టి20ల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఒకే పర్యటనలో వన్డే, టి20 రెండు సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత మహిళల జట్టు రికార్డు సృష్టించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్ మిథాలీ రాజ్ 62(50 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్స్‌లు) పరుగులతో అద్భుతంగా రాణించింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన 13 పరుగులతో నిరాశపరచగా, రోడ్రిగస్ 44( 34 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్స్‌లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 27(17బంతుల్లో ఒక ఫోర్, 2సిక్స్‌లు) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేప్, ఖకా, ఇస్మాయిల్ తలో వికెట్ పడగొట్టారు. అనతంరం 167 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 112 పరుగులకే పరిమితమైంది. కాప్ 27 పరుగులు, ట్రైయాన్ 25 పరుగులు చేయగా, మిగితా వారు ఘోరంగా విఫలమవ్వడంతో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. భారత బౌలర్లో శిఖా పాండే, థార్, గైక్వాడ్‌లు తలో 3 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.