Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నీటిపై తేలే ఇంద్రలోకం

Indonesia owns many natural nutrients
కొండలు కోనలు, అందమైన బీచ్‌లు, ద్వీపాలు, అగ్నిపర్వతాలు, సరస్సులు ఇంకా ఎన్నో ప్రకృతి సోయగాలు ఇండోనేషియా సొంతం. ఈ దేశంలో ప్రకృతి అందాలకు కొదవేలేదు. మలాయ్ ద్వీపాల సముదాయంలో ఉన్న మూడు ద్వీపాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రపంచంలో అత్యధిక ప్రజలు ఇష్టపడే పర్యాటక ప్రాంతాల్లో ఇండోనేషియా కూడా ఒక్కటి.

గిలి ఐలాండ్స్, లంబోక్ : గిలి ఐలాండ్స్, లంబోక్: ఇక్కడి విల్లాలు.. నీటిపై తేలుతున్నట్లుగా ఉంటాయి. చిన్న చిన్న ద్వీపాలపై ఉండే విల్లాలు.. హనీమూన్ జంటలకు భలే నచ్చేస్తాయి. నీలి రంగు పులుముకున్న సముద్రపు నీరు.. తెల్లని ఇసుక తిన్నెలతో ఈ మూడు ద్వీపాలు భలే ఆహ్లాదకరంగా ఉంటాయి.

రాజా అంపత్ ఐలాండ్స్ : రాజా అంపత్ ఐలాండ్స్: ‘రాజా అంపత్’ అంటే నలుగురు రాజులని అర్థం. వ్యాయియో, మియుల్, సలావాటి, బటాన్టా అనే నాలుగు ద్వీపాలను కలిపి ఇలా పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ నాలుగు ద్వీపాల సమీపంలో దాదాపు 1500 బుల్లి బుల్లి ద్వీపాలు ఉన్నాయి. అలాగే, ఇక్కడి బీచ్‌లు, అడవులు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ అండర్ వాటర్ డైవింగ్ కూడా అందుబాటులో ఉంది.

మలుక్ బీచ్, సంబ్వా ఐలాండ్ : మలుక్ బీచ్, సంబ్వా ఐలాండ్: దక్షిణ సంబ్వాలోని ఉత్తర సముద్ర తీరంలో ఉన్న మలుక్ బీచ్‌లోని నీరు సూర్య కిరణాలకు అనుగుణంగా రంగు మార్చుకుంటుంది. ఇది చూసేందుకు చాలా భిన్నంగా, చిత్రంగా ఉంటుంది.

కేలిముటు లేక్, నుసా తెంగర తిమూర్ : కేలిముటు లేక్, నుసా తెంగర తిమూర్: ఇండోనేషియా వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్రాంతమిది. ఇక్కడ ఉన్న మూడు అగ్నిపర్వతాలు.. అందమైన సరస్సులుగా పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. చిత్రం ఏమిటంటే.. ఈ మూడు అగ్నిపర్వత సరస్సులు మూడు రంగుల్లో కనిపిస్తాయి. తెలుపు, నీలం, ఎర్ర రంగుల్లో కనువిందు చేస్తాయి.

లేక్ తోబా, నార్త్ సుమత్ర : లేక్ తోబా, నార్త్ సుమత్ర: ఇది ప్రపంచంలో అగ్నిపర్వతం వల్ల ఏర్పడిన అతిపెద్ద సరస్సు ఇది. దాదాపు 70వేల ఏళ్ల కిందట ఏర్పడిన ఈ సరస్సు ఓ ద్వీపంలో ఉంది. ఈ సరస్సులో కూడా మరో ద్వీపం ఉండటం గమనార్హం.

బనకెన్ మెరైన్ పార్క్ : బనకెన్ మెరైన్ పార్క్: ఇది నార్త్ సులావేసి ద్వీపంలో ఉంది. ఇక్కడి నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ అనేక రకాల చేప రకాలను ఈ ద్వీపంలో చూడొచ్చు.

కొమాడో నేషనల్ పార్క్ : కొమాడో నేషనల్ పార్క్: ఇక్కడ అతిపెద్ద బల్లులను చూడొచ్చు. వీటిని కొమాడో డ్రాగన్స్ అని పిలుస్తారు. ఈ ద్వీపం ఇండోనేషియాలోనే అత్యంత అందమైన ప్రాంతం.

మౌంట్ బ్రోమో, ఈస్ట్ జావా : మౌంట్ బ్రోమో, ఈస్ట్ జావా: ఇక్కడ అగ్నిపర్వతం ఎప్పుడూ మండుతూ ఉంటుంది. దీని జ్వాలాముఖి నుంచి నిత్యం పొగలు వస్తునే ఉంటాయి. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

మౌంట్ రింజానీ : మౌంట్ రింజానీ: దీన్ని గునుంగ్ రింజానీ అని కూడా పిలుస్తారు. ఇండోనేషియాలోని కెరిన్సి తర్వాత రెండో అతిపెద్ద అగ్నిపర్వతం ఇది. ఈ అగ్నిపర్వతం కింద ఉండే సెగరా అనంక్ సరస్సు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

బాలి : ఇండోనేషియాలోని బాలి ప్రాంతం గురించి పెద్దగా పరిచయం అక్కడర్లేదు. ఆసియాలో అత్యధిక పర్యటకులు సందర్శించే ప్రాంతం ఇది. అందమైన బీచ్‌లు, ద్వీపాలు, ఆలయాలు, బౌద్ధ స్థూపాలు, బౌద్ధ సంప్రదాయాలు, స్థానికుల అతిథ్యం.. ఇక్కడ ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే.

Comments

comments