Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సృష్టికే షాక్: గుడ్లు పెడుతున్న బాలుడు!(వీడియో)

Teenage-boy-lays-an-EGG-in-

జకార్తా: సృష్టికి విరుద్ధంగా 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్న ఘటన ఇండోనేషియాలో సంచలంగా మారింది. గత రెండేళ్లలో ఆ బాలుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 గుడ్లు పెట్టాడట. ఇదేం విచిత్రమని ఆశ్చర్చపోతున్నారా? కాని ఇది నిజమండి బాబూ. మనోడు ఇలా వరుస పెట్టి గుడ్లు పెడుతుంటే అది చూసినవారు ఇదేం విచిత్రమంటూ షాకవుతున్నారట. పసుపు, తెలుపు రంగుల్లో ఈ గుడ్లు ఉంటున్నాయట. ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే టీనేజర్ ఈ విచిత్ర వ్యవహారంతో అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాడు. అక్మల్ తండ్రి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

దీనిపై అక్మల్ తండ్రి కొంతమంది వైద్యులను కూడా కలిశారు. వాళ్ల ముందు కూడా అక్మల్ గుడ్లు పెట్టాడు. దాంతో డాక్టర్లు కూడా గుడ్లు తేలేశారు. అక్మల్‌కు అన్ని టెస్టులు చేసిన ఫలితం మాత్రం లేకపోయింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని మాత్రం ఆ డాక్టర్లు కనిపెట్టలేక పోయారట. అసలు మనిషి గుడ్డు పెట్టడం ఏమిటని ప్రస్తుతం ఆ బాలుడిపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడీ వింత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పనిలో పనిగా అక్మల్ వైద్యుల ముందు గుడ్డు పెట్టిన ఓ వీడియోను కూడా అంతర్జాలంలో పెట్టారు. దాంతో ప్రస్తుతం ఈ విచిత్ర, సృష్టి వ్యతిరేక వ్యవహారంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

Comments

comments