Home తాజా వార్తలు అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : ఇంద్రకరణ్ రెడ్డి

అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : ఇంద్రకరణ్ రెడ్డి

Indrakaran Reddyనిర్మల్ : ఎన్నికలు ఏవైనా విజయం సాధించేది కేవలం టిఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని రాష్ట్ర  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో నిర్మల్ మండల టిఆర్‌ఎస్ కార్యకర్తల  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు.  సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇప్పటికే అనేక పార్టీల నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున టిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్దితో అన్ని ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ కే పట్టం గడుతున్నారని ఆయన తెలిపారు.  భారీ మెజార్టీతో ఎంపిటిసిలు, జెడ్పిటిసిలను కైవసం చేసుకోవటానికి ప్రతీ ఒకరూ కృషి చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రతీ ఒకరూ సమష్టిగా నిర్వహించాలని సూచించారు.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జెడ్పి స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు రాంకిషన్‌రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, ముత్యంరెడ్డి, గోవర్థన్‌రెడ్డి, అల్లోల గౌతంరెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, మండల జెడ్పిటిపి, ఎంపిటిసి అభ్యర్థులు పాల్గొన్నారు.

Indrakaran Reddy Comments on MPTC and ZPTC Elections