Home తాజా వార్తలు నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారం

నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారం

Indrakaran Reddy Elections Campaign

నిర్మల్ : నిర్మల్ టిఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం నిర్మల్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్, టిడిపి పార్టీల పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేశారని ఆయన కొనియాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వందకు పైగా స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వడ్డెపల్లి, రత్నాపూర్ కాండ్లీ, వడ్యాల్ తదితర గ్రామాల్లో ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి , తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికార దాహంతో మహాకూటమిగా ఏర్పడిన ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ నేతలకు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.

Indrakaran Reddy Elections Campaign