Home తాజా వార్తలు ఇంద్రసేన ఫస్ట్‌లుక్ విడుదల

ఇంద్రసేన ఫస్ట్‌లుక్ విడుదల

RADHIKA--CHIRU

హైదరాబాద్ : ఇంద్రసేన సినిమా ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి మంగళవారం విడుదల చేశారు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సందర్భంగా చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందించారు. విజయ్ ఆంటోని, నటి రాధిక సంయుక్తంగా ఇంద్రసేన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజయ్ ఆంటోని ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయన చూసుకుంటున్నారు.

Indrasena firstlook Release