Home తాజా వార్తలు వరంగల్‌లో పారిశ్రామిక కారిడార్ : కెటిఆర్

వరంగల్‌లో పారిశ్రామిక కారిడార్ : కెటిఆర్

KTR

హైదరాబాద్ : వరంగల్‌లో 50 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. టెక్స్‌టైల్స్ పార్క్ కోసం భూమిని సేకరించామన్నారు. టెక్స్‌టైల్స్ పార్క్‌తో మహిళలకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు. 2018లో టెక్స్‌టైల్స్ పార్క్ పూర్తి స్థాయిలో పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.