Home కరీంనగర్ పచ్చునూర్ ఉప సర్పంచ్‌పై వీగిన అవిశ్వాసం

పచ్చునూర్ ఉప సర్పంచ్‌పై వీగిన అవిశ్వాసం

table

కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు
మనతెలంగాణ/మానకొండూర్:మండలంలోని పచ్చునూర్ గ్రామ ఉప సర్పంచ్ పార్నంది సారమ్మ(స్వరూప)పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం గురువారం వీగిపోయింది. ఉప సర్పంచ్‌పై అవిశ్వాసం వీగిపోవడంతో కా ంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఉప సర్పంచ్ సారమ్మపై అవిశ్వాసం ప్రవేశపెడుతూ ఇటీవల వార్డు సభ్యులు అధికారులకు అవిశ్వాసం నోటీసును అందజేశారు.
కరీంనగర్ ఆర్‌డిఒ బి.రాజాగౌడ్ అవిశ్వాసంపై బలనిరూపణకు గురువారం సమయం కేటాయించారు. గ్రామ పంచాయితీ కార్యాలయ ంలో ఆర్‌డిఒ రాజాగౌడ్, స్థానిక ఎంపిడిఓ కె.వెంకట్రాంరెడ్డి, ఇఓఆర్‌డి పి.దేవదాసు గురువారం ఉదయం పది గంటల నుంచి 11 గంటల వ రకు అవిశ్వాసంపై ఓటింగ్ ఉండగా, కోరం హాజరుకాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్‌డిఒ రాజాగౌడ్ ప్రకటించారు. 12 మంది వార్డు సభ్యుల్లో సారమ్మకు పది మంది వార్డు సభ్యులు మద్దతు పలికి అవిశ్వాసానికి హాజరుకాలేదు. దీంతో ఉప సర్పంచ్ అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని సారమ్మ వర్గం సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు మాత్రమే ఉప సర్పంచ్‌కు వ్యతిరేకంగా ఉండటంతో అవిశ్వా సం వీగిపోయింది. అవిశ్వాసం వీగిపోవడంతో టిఆర్‌ఎస్ నాయకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మానకొండూర్ మాజీ ఎంఎల్‌ఎ ఆరెపల్లి మోహన్, ప్రముఖ వైద్యులు, కాంగ్రెస్ నియోజకవర్గ నేత డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు సారమ్మ-నర్సయ్యను అభినంధించారు. అవిశ్వాసం వీగిపోవడంతో కవ్వంపల్లి సత్యనారాయణ తన స్వగ్రామం లో తన పంతం నెగ్గించుకున్నట్లు అయింది.