Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పెరిగిన ద్రవ్యోల్బణం

  • జులైలో రిటైల్ 2.36 శాతానికి
  • స్వల్పంగా పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

food-stall-india

న్యూఢిల్లీ : కొద్ది నెలలుగా దిగువకు చేరుకున్న ద్రవ్యోల్బణ గణాంకాలు మళ్లీ పెరుగుదలను వైపు పయనిస్తున్నా యి. జులై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం అలాగే టోకు ద్రవ్యోల్బణం రెండు సూచీలు స్వల్పంగా పెరిగాయి. ఇప్పటికే ఆర్‌బిఐ అంచనా స్థాయి 4 శాతం స్థాయి కంటే దిగువనే ఉండగా, దీంతో వడ్డీ రేటు తగ్గింపు విషయంలో అలోచించే అవకాశాలున్నాయి. సిపిఐ(వినిమయ ధర సూచీ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 2.36 శాతానికి పెరిగింది. ఇంతకుముందు జూన్‌లో ఇది 1.46 శాతంగా ఉంది. మరోవైపు జులై నెలలో టోకు ద్రవ్యోల్బ ణం 1.88 శాతంతో స్వల్పంగా పెరిగింది. అంతకుముం దు నెలలో ఇది 0.90 శాతంగా ఉంది. ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ ఆధారిత డబ్లుపిఐ(టోకు ధర సూచీ) స్వల్పంగా పెరిగింది.
రిటైల్ ద్రవ్యోల్బణం 2.36 శాతానికి..
రిటైల్ ద్రవ్యోల్బణం 2.36 శాతానికి పెరిగింది. జూన్‌లో 1.54 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం, జూలైలో పెరిగింది. ఆహార ధరలు తగ్గడం తగ్గుముఖం పట్టడంతో జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఈమేరకు సోమవారం ప్రభుత్వ గణాంకాల శాఖ సిపిఐ (వినియోగదారుల ధరల సూచీ) ఆధారిత ద్రవ్యోల్బణం వివరాలను వెల్లడించింది. గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టిన ధరలు మళ్లీ పెరుగుదలను నమోదుచేశాయి. ఈ పెరుగుదల రాయిటర్స్ పోల్‌లో ఆర్థికవేత్తలు అంచనావేసిన 1.87 శాతం కంటే కూడా ఇంకా ఎక్కువగా ఉంది. షుగర్, మిఠాయి ఉత్పత్తుల ధరలు జూలై నెలలో 8.27 శాతం పైకి ఎగిశాయి. వీటితో పాటు పాన్, పొగాకు, మత్తుపదార్థాలు కూడా 6.39 శాతం పెరిగాయి. గృహ వ్యయాలు 4.98 శాతం, దుస్తులు, పాదరక్షకుల ఉత్పత్తుల ధరలు కూడా 4.22 శాతం పెరుగుదల ఉంది. వీటితోపాటు కూరగాయలు ధరలు పెరగడం ప్రారంభం కావడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినట్టు ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇదే ధోరణి డబ్ల్యూపిఐలో కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు నెలలో కూడా కూరగాయల ధరలు ఎక్కువగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. నేడు విడుదలైన ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి రేటు కోత చేపట్టకపోవచ్చని తెలుస్తోంది

 

Comments

comments