Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

లక్ష్యం పరిధిలోనే ద్రవ్యోల్బణం

 కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

Arun-Jaitlywన్యూఢిల్లీ: ఆగస్టు నెలలో టోకు ధర సూచీ (డబ్లు పిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.24 శాతానికి పెర గడంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందిం చారు. ఇది 4 శాతం లక్ష్యానికి దిగువనే ఉందని అన్నారు. ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు పెరగడంతో ఈ ఏడాదిలో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థా యికి చేరిందని, ప్రస్తుతం 3.24 శాతానకి తా కిందని, ఇది సహేతుకమైందేనని అన్నారు. యు పిఎ ప్రభుత్వం హయాంలో ద్రవ్యోల్బణం రెండంకె ల వైపు దూసుకెళ్లిందని, ఇప్పుడు నియంత్రణలోనే ఉందని ఆయన వివరించారు. ద్రవ్యపరపతి విధా న సమీక్షలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) పేర్కొన్న 4 శాతం లక్షం పరిధిలోనే ద్రవ్యోల్బణం ఉందని జైట్లీ తెలిపారు. గత మూడేళ్లుగా ద్రవ్యోల్బ ణం నియంత్రణకు తీసుకున్న చర్యలు నిత్యావసర వస్తువుల ధరలు దిగివచ్చాయని మంత్రి అన్నారు. ద్రవ్య విధాన కమిటీ కూడా ద్రవ్యోల్బణ నిర్వహణ లక్షం 4 శాతంగా నిర్ణయించిందని అన్నారు. గు రువారం ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్ర కారం, ఆగస్టు నెలలో డబ్లుపిఐ(టోకు ధరల సూచీ) ఆధారిత ద్రవ్యోల్బణం 3. 24 శాతం న మోదైంది. జూలైలో 1.88 శాతంతో పోల్చితే ఈ సారి భారీగా పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం, ఇంధన ఉత్పత్తుల ధరలు పెరగడం వల్లే డబ్లుపిఐ పెరిగింది. కొద్ది రోజుల క్రితం ఐఐపి(పారిశ్రామి ఉత్పత్తి సూచీ), రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి దేశీ య పారిశ్రామిక ఉత్పత్తి స్వ ల్పంగా పుంజుకుంది. గనులు, విద్యుత్ రంగాల్లో ఉత్తమమైన పనితీరు వల్ల జులైలో ఐఐపి 1.2 శాతానికి పెరిగింది. జూన్ లో 0.1 శాతంతో పోలిస్తే ఈసారి ఐఐపి వృద్ధిని సాధించింది. అయితే ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఆహార పదార్థాల ధరలు ప్రి యం కావడంతో ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 3. 36 శాతంతో పెరిగింది.

Comments

comments