Home బిజినెస్ ఇన్ఫోసిస్ నికర లాభం 3,612 కోట్లు

ఇన్ఫోసిస్ నికర లాభం 3,612 కోట్లు

Infosys net profit stood at Rs 3,612 crore

n గతేడాదితో పోలిస్తే క్యూ1లో 3.7 శాతం వృద్ధి
n ఆదాయం 12 శాతం పెరిగింది
n 1:1 బోనస్ జారీకి కంపెనీ బోర్డు ఆమోదం
న్యూఢిల్లీ : జూన్ ముగింపు నాటికి తొలి త్రైమాసికంలో దేశీయ రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ నికర లాభం రూ.3,612 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో రూ.3,483 కోట్లతో పోలిస్తే ఈసారి 3.7 శాతం వృద్ధిని సాధించింది. విశ్లేషకుల అంచనాలను మా త్రం కంపెనీ అందుకోలేకపోయింది. ఇటి నౌ సర్వేలో కంపె నీ నికర లాభం రూ.3,731 కోట్లు ఆర్జిస్తుందని అంచనా వేయగా, దీనిని చేరుకోలేదు. బెంగళూరు అధికార కార్యాలయంగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ ఆపరేషన్ల నుంచి ఆదాయం 12 శాతం పెంచుకుంది. ఏప్రిల్‌జూన్ త్రైమాసికంలో ఆదాయం రూ.19,128 కోట్లు ఆర్జించగా, అంతకుముందు త్రైమాసికంలో రూ.17,078 కోట్లు నమోదు చేసింది. ఈమేరకు ఇన్ఫోసిస్ బిఎస్‌ఇ ఫైలింగ్‌లో వెల్లడించింది. అలాగే కంపెనీ బోర్డు 1:1 బోనస్ జారీకి ఆమోదించింది. ప్రతి ఈక్విటీ షేరుకు ఒక బోనస్ షేరును సిఫారసు చేయగా బోర్డు పరిశీలించి, ఆమోదం తెలిపిందని సంస్థ తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను కరెన్సీలో ఆదాయం వృద్ధి అంచ నా 68 శాతంగా కంపెనీ నిర్ణయించింది. ఆపరేటింగ్ మార్జిన్‌ను కూడా 22 నుంచి 24 శాతం మధ్య స్థాయిలో కంపెనీ అంచనా వేస్తోంది. ఇన్ఫోసిస్ సిఇఒ, ఎండి సలీల్ పరేఖ్ మాట్లాడుతూ, ఈ త్రైమాసికంలో పటిష్టమైన ఆదాయ, మార్జిన్ వృద్ధిని చూపామని, చురుకైన డిజిటల్, ఆర్జిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై తాము దృష్టి పెట్టామని అన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫీ ఫలితాలను వెల్లడించింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో ఇన్పోసిస్ షేరు విలువ 2 శాతం లాభపడి రూ.1,323 వద్ద ముగిసింది.
డీలాపడిన మార్కెట్ సూచీలు
క్రితం రోజు పరుగులు తీసిన మార్కెట్లు శుక్రవారం డీలాపడ్డాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్ ఒడిదొడుకులకు లోనైంది. చివరికి 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 36,542 వద్ద ముగిసింది. మరోవైప నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 11,019 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రోత్సాహంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రారంభంలో సూచీలు లాభాలతో సాగాయి. మిడ్ సెషన్ నుంచి మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,740కు చేరింది. ఎన్‌ఎస్‌ఇలో అన్ని రంగాలూ పతనమవ్వగా, ఐటి స్వల్పంగా లాభపడింది. పిఎస్‌యు బ్యాంక్స్, రియల్టీ, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా 2- నుంచి 1 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో జి, ఇన్‌ఫ్రాటెల్, యాక్సిస్, ఒఎన్‌జిసి, గ్రాసిమ్, ఐటిసి, యుపిఎల్, హెచ్‌సిఎల్ టెక్, లుపిన్, ఎస్‌బిఐ 4.5- నుంచి 2 శాతం మధ్య పతనమయ్యాయి. అదే సమయంలో టైటన్, బిపిసిఎల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, ఐఒసి, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్, కోల్ ఇండియా 3.7- నుంచి 0.85 శాతం మధ్య బలపడ్డాయి. మార్కెట్లను మించుతూ చిన్న షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. దీంతో బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్ సూచీ 0.8 శాతం, స్మాల్ క్యాప్ 1.4 శాతం మేరకు వెనకడుగు వేశాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1824 నష్టపోగా, 813 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 636 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, రూ.743 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.