Home తాజా వార్తలు సుంకేసుల రిజర్వాయర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో

సుంకేసుల రిజర్వాయర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో

Sunkesula-Reserviorమహబూబ్‌నగర్‌ః ఎగువనున్న కర్ణాటకలో వర్షాలు పరిస్థితి నిలకడగా కొనసాగుతుండటంతో గురువారం సుంకేసుల రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతూ వస్తోంది. రాజోళి గ్రామ శివారుల్లో ఉన్నటువంటి సుంకేసుల డ్యాంకు గురువారం ఇన్‌ఫ్లో 51వేల క్యూసెక్కులకు పెరగడంతో 13 గేట్లను ఒక మీటర్ ఒక మీటర్ మేర ఎత్తి దిగువనున్న శ్రీశైలంకు 53 వేల క్యూసెక్కుల నీటిని వదిలినట్లు డ్యాం అధికారులు తెలిపారు. డ్యాం యొక్క పూర్తి సామర్థం 1.2 టిఎంసీలు కాగా 1 టిఎంసీ నీటిని నిల్వ ఉంచినట్లు లస్కర్ మునిస్వామి తెలిపారు.