Home జాతీయ వార్తలు కేజ్రీవాల్‌పై సిరా దాడి

కేజ్రీవాల్‌పై సిరా దాడి

Kejriwalజయపుర : ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి సిరా దాడి జరిగింది. మంగళవారం రాజస్థాన్‌లోని ఆప్ పార్టీ సమావేశానికి వెళ్లిన కేజ్రీవాల్‌కు ఈ చేదుఅనుభవం ఎదురైంది. తనపై సిరా దాడి చేసిన వారిని దేవుడు చల్లగా చూడాలని కేజ్రీవాల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి రాజస్థాన్‌లోని బికనేర్‌లో స్థానిక ఆప్ నేత శంకర్ సేవదాస్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. అక్కడ దినేష్ వోజా అనే వ్యక్తి జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నావంటూ కేజ్రీవాల్‌పై సిరా దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన దినేష్ ఎబివిపి నేతగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.