Search
Wednesday 26 September 2018
  • :
  • :

‘గీత గోవిందం’ ఫస్ట్ సాంగ్ రిలీజ్

Githa-govindham

సినిమా: అర్జున్ రెడ్డి సిన్మా తరువాత వరుస సినిమాలతో మంచి ఊపుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్ లో గీత గోవిందం అనే సిన్మాలో హీరోగా చేస్తున్నాడు. పరశురామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సిన్మాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. కుటుంబం కథా నేపథ్యంలో వస్తున్నఈ సిన్మాకి గోపీసుందర్ సంగీతాన్నిసమకూర్చుతున్నారు.  ఈ చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతుందని చిత్రబృదం పేర్కొంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి ఇటీవలే రిలీజ్ అయి చిత్రంపై అభిమానులలో ఆసక్తి పెంచింది. పోస్టర్ ని చూసిన ప్యాన్స్ అర్జున్ రెడ్డి తరహాలో ఈ సిన్మాలో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయా..? అనే ఆలోచనలో పడ్డారు. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న ఈ సిన్మాకి చెందిన ఒక్కొక్క పాటని విడుదల చేయాడానికి మూవీ మేకర్స్ రేడీ అయ్యారు. (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే) అంటూ సాగే ఈ పాటను కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది.

Comments

comments