Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

భళా భారత్!

ఉప్పల్ లో పరుగుల ఉప్పెన   

‘డబుల్’తో   కదం తొక్కిన కోహ్లి

సెంచరీతో సత్తా చాటిన సాహా

687/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్

kohliహైదరాబాద్: తో హైదరాబాద్ ఉప్ప ల్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ తన ఆధిపత్యాన్ని ప్రద ర్శిస్తోంది. రెండో రోజు శుక్రవా రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పటి ష్ట స్థితిలో నిలిచింది. క్రీజ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మెన్లంతా రాణిం చడంతో 166 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పో యి 687 పరుగుల వద్ద డిక్లెర్డ్ చేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (204; 24×4) 246 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించగా, ఓపెనర్ విజయ్ (108; 12×4, 1×6), వికెట్ కీపర్ సాహా (106; 7×4, 2×6)సెంచరీలు నమోదు చేశారు. వీరి తో పాటు పుజారా (83), రహానె (82) త్రుటి లో సెంచరీలు చేజార్చుకోగా, జడేజా (60) పరుగులతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనించింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాను ఉమేశ్‌యాదవ్ ఆదిలోనే దెబ్బతీశాడు. ఓపె నర్ సౌమ్య సర్కార్ (15)ను అవుట్ చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.
‘డబుల్స్’తో సరికొత్త చరిత్ర
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా నాలుగు సిరీస్‌లలో డబుల్ సెంచరీలు సాధించిన డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించాడు. బ్రాడ్‌మన్, ద్రవిడ్ వరుసగా మూడు సిరీస్‌లలో డబుల్ టన్స్ చేయగా, బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరుగుతు న్నఏకైక టెస్ట్‌లో కోహ్లి 204 పరుగుల చేసి చరిత్ర సృష్టించాడు. గతంలో మూడు ద్విశతకాలు వరుసగా వెస్టిండీస్‌పై 200, న్యూజిలాండ్‌పై 211, ఇంగ్లండ్‌పై 235 సాధించాడు.
కోహ్లి నాటౌట్?
తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో కోహ్లి స్లైడర్‌ను కట్ చేద్దామన్న ప్రయత్నం విఫలమై బంతి మొదట ప్యాడ్‌కు తగిలింది. దీంతో ఎంపైర్ ఎరాస్మస్ ఎల్‌బిగా ప్రకటించాడు. అయితే రీ ప్లేలో మాత్రం బంతి ఆఫ్ స్టిక్ పక్కగా వెళుతున్నట్లు కనిపించింది. అంపైర్ నిర్ణయంపై ‘రివ్యూ’ అడిగి ఉంటే కోహ్లి క్రీజులో కొనసాగేవాడేమో.
శతక్కొట్టిన సాహా
భారత వికెట్ కీపర్ సాహా తన టెస్ట్ కెరీర్‌లో రెండో శతకం సాధించి రికార్డు సృష్టించాడు. విదేశాల్లో, స్వదేశంలో సెంచరీ చేసిన ఏకైక భారత వికెట్ కీపర్‌గా సాహా నిలిచాడు. సాహా గతంలో వెస్టిండీస్‌లో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగులు చేశాడు. అయితే ఇప్పటివరకు సాహా రెండు సెంచరీలు మాత్రమే చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో 155 బంతులను ఎదుర్కొన్న సాహా 106 పరుగులు చేశాడు.

Comments

comments