Home నల్లగొండ పల్లెలకు పండగొచ్చింది

పల్లెలకు పండగొచ్చింది

Innovation in the initial gram panchayats

ఆరంభమైన గ్రామ పంచాయతీల్లో నవశకం
578గ్రామాలు, 10మున్సిపాలిటీల్లో పాలన
మంత్రి, ఎమ్మెల్యేల చేతులమీదుగా ప్రారంభం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉరకలేసిన ఉత్సాహం

మన తెలంగాణ/నల్లగొండ : గ్రామస్వరాజ్యమే ధ్యేయం గా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ పల్లెసీమల రూపురేఖలను సమూలంగా మార్చనుంది. ఎన్నో ఏళ్ళుగా ఎక్కడో మారుమూల ఉన్న తండాలు, గూడేలు, ఒక గ్రామానికి అనుబంధంగా ఉన్న శివారు పల్లెలకు ఇప్పుడు స్వాతంత్య్రం దక్కిందనే చెప్పాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పల్లెల్లో గురువారం పండుగ వాతావరణంలో నూతనశకం ఆరంభమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన 578 గ్రామ పంచాయతీలు, 10కొత్త మున్సిపాలిటీలలో పండుగు వాతావ రణంలో కొత్త పాలన మొదలైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహ ంగా పంచాయతీ, మున్సిపాలిటీల ప్రారంభోత్సవాల్లో పాల్గొని ఆయా ప్రా ంత ప్రజల కు శుభా కాంక్షలు తెలిపారు. కొత్త పం చాయతీ, మున్సి పాలిటీ భవనా లను పర్వదినాల రోజున అలంకరి ంచి నట్లు అందంగా తీర్చిదిద్ది గ్రామ స్థులందరిని భాగస్వామ్యులను చేస్తూ ప్రారంభించారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వివిద ప్రాంతాల్లో పాల్గొ ని పార్టీల శ్రేణులతో పాటు ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఉ మ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పంచాయతీ, మున్సిపల్ కార్యా లయాలు ప్రారంభించి పలు ప్రాంతాల్లో బాణా సంచా పేళుల్లు, కెసి ఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

గిరిజ నతండాల్లో గిరిజన సంప్రదాయ నృత్యాలు, తీజ్‌బట్టలతో జిల్లా మం త్రి జగదీశ్‌రెడ్డికి స్వాగతం పలికారు. పెద్దవూర మండలం కుంకు డుచెట్టు తండా, పెన్‌పహాడ్ మండలం బంజారహిల్స్ నూతన గ్రామ పంచా యతీతో పాటు నాగార్జునసాగర్ నందికొండ, హాలియా, నేరే డుచర్ల మున్సిపాలిటీల ప్రారం భోత్స వంలో పాల్గొని ఆయా కార్యా లయాలను లాంఛనంగా ప్రారంభించారు. ఇక తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తుంగతుర్తి బాయితండా, నాగారం మండలంలో, మోత్కూరు మున్సిపల్ కార్యాలయంతో పాటు రాగిబావి, అడ్డగూడూరు మండలంలోని కొండంపేట పంచాయతీల కార్యాలయాలను ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిపి ప్రారంభించారు.

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని ఇస్కబావిగూడెం, సీత్యాతండ పంచాయతీల కార్యాలయాలను ప్రారంభించారు. ఇక సూర్యాపేట జిల్లా మేళ్ళచెర్వు మండలం వెంకటాపురం పంచాయతీని ఆ జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ పారంభించగా, యాదాధ్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని, వలిగొండ మండలంలోని ఐదు గ్రామ పంచాయతీల కార్యాలయాలను, బీబీనగర్ మండలం మహదేవ్‌పూర్ పంచాయతీని ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పీఏ పల్లి మండలం అక్కంపల్లి, ఎర్రగుంట తండా పంచాయతీలను, కొండమల్లేపల్లి మండలంలోని కేశతండా, వర్ధమాన్‌గూడెం గ్రామాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే విదంగా చందంపేట మండలంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు జడ్పీ చైర్మన్ బాలూనాయక్ పాల్గొన్నారు. కొండమల్లేపల్లి మండలం చిన్నారి సర్వేపల్లి గ్రామంలో జడ్పీ చైర్మన్ బాలూనాయక్, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో లింగంపల్లి పంచాయతీని ఇన్‌చార్జ్ నోముల నర్సింహ్మయ్య ప్రారంభించారు. ఇక నకిరేకల్ నియోజకవర్గంలో చిట్యాల మున్సిపల్ కార్యాలయంను, నార్కట్‌పల్లి మండలం జీవీగూడెం, చిప్పలపల్లి, బాజకుంట, పోతాననిపల్లి, తిరుమలగిరి నూతన కార్యాలయంలను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఇక నల్లగొం నియోజకవర్గం పరిధిలోని నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లో టిఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ భూపాల్‌రెడ్డి కొత్త పంచాతీల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో విస్ర్తుతంగా పర్యటించారు. పంచాయతీ కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్బంగా డప్పువాయిద్యాలతో కళాకారుల నృత్యప్రదర్శనలతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పంచాయతీ ప్రారంభాన్ని పురస్కరించుకొని కేక్‌కట్ చేయడంతో పాటు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.