Home జాతీయ వార్తలు మేల్‌ నర్స్ దారుణం.. శిశువు రెండు ముక్కలు…

మేల్‌ నర్స్ దారుణం.. శిశువు రెండు ముక్కలు…

Babay Deadజైపూర్: ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆస్పత్రికి వస్తే మేల్‌ నర్స్ దారుణానికి పాల్పడిన విషాద సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని రామ్‌ఘడ్ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. పురిటి కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు గర్భశోకం మిగిల్చాడు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఒక మేల్ నర్స్(పురుషుడు) పురుడు పోశాడు. అయితే, బిడ్డను బయటకు తీసే క్రమంలో రెండు చేతులతో బలంగా లాగాడు. దీంతో గర్భిణి కడుపులోనే బిడ్డ తల ఉండిపోయి, మొండెం మాత్రం బయటకు వచ్చింది. శిశువు రెండు భాగాలుగా విడిపోయి ముక్కలుగా రావడం అందరికి దిగ్భ్రాంతి కలిగించింది.

శిశువు మొండెం భాగాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించి, బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం జైసల్మేర్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సదరు మేల్‌ నర్స్ సలహా ఇవ్వడం గమనార్హం. మహిళ కడుపులో శిశువు తల ఉండిపోవడంతో డాక్టర్ రవీంద్ర శంఖ్లా ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఆమెకు శస్త్రచికిత్స చేసి తలను బయటకు తీశారు. ఈ హృదయవిదారకర సంఘటన అక్కడివారిని తీవ్రంగా కలిచి వేసింది. కాగా, బాధితురాలి భర్త ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Insensitive male nurse splits baby in half in Rajasthan