Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ సంబంధం విడదీయరానిది: మోడీ

ghani-and-Modi

పంజాబ్: అమృత్‌సర్‌లో హార్ట్ ఆప్ ఆసియా సదస్సులో భద్రత, వాణిజ్య అంశాలపై భారత్, ఆప్ఘనిస్థాన్‌ల మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ…. సిక్కు గురువులు నివసించిన ప్రదేశం అమృత్‌సర్ అని, పవిత్ర స్థలంలో సదస్సు జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆప్ఘనిస్థాన్ నుంచి అమృత్‌సర్‌కు చాలా మంది పర్యాటకులు వస్తుంటారని గుర్తు చేశారు.   ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ సంబంధం విడదీయరానిదని తెలిపారు. అభివృద్ధే ప్రధానాంశంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలను కలిసికట్టుగా నియంత్రించాలని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని ఆయన సూచించారు. ఉగ్రవాదులకు సాయం చేయడం ఏమాత్రం సరికాదన్నారు.

ఈ సమావేశంలో అష్రాఫ్ ఘనీ మాట్లాడుతూ… భారత్‌తో ఆప్ఘనిస్థాన్‌కు పటిష్ట సంబంధాలున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య స్థిరత్వం, భద్రత అంశాలు ప్రధానమైనవని చెప్పారు. ఇరు దేశాలు సంస్కరణలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

Comments

comments