Home ఆదిలాబాద్ కొనసాగుతున్న ప్రజావేదిక

కొనసాగుతున్న ప్రజావేదిక

బట్టబలైన 8జిపిలు పూర్తి
నేడు మరో 8 జిపిలపై చర్చ
పలు అక్రమాలు బహిర్గతం
కూలీ డబ్బుల కోసం కూలీల వినతులు

Prajavedika

ఉట్నూర్: మహాత్మగాంధీ ఉపాధి హా మీ పథకంపై నిర్వహించిన సామాజిక తనిఖీ బుధవారం కొనతుంది. బుధవారం మండల కేంద్రంలోని ఎం పిడిఒ సమావేశ మందిర ఆవరణలో 01-09-2015 నుండి 31-10-2016 వరకు మండలంలో సుమారు గా 9కోట్ల రూపాయల పనులు జరిగాయి. దినిపై సా మాజిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డ్వామా పిడి రాథోడ్ రాజేశ్వర్, రాష్ట్ర మానిటరింగ్ అ ధికారి దత్తు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మొదటగా నాగాపూర్ గ్రామపంచాయతీ సామాజిక తనీఖీలో బయట పడ్డ విశయాలపై చర్చించారు. ఎ క్స్‌రోడ్డు గ్రామంలో పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేసినట్లు డిఆర్పీ తెలిపారు.

శ్యాంపూర్‌లో పంచా యతీ పరిధిలో ఎన్ని మొక్కలు అందజేశారు ఎన్ని మొ క్కలు బతికి ఉన్నయన్న విషయాలు సైతం టీఎలకు, ఎఫ్‌లకు తెలియకపోవడంతో పిడి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిమడుగులో లబ్ధిదారులకు చెల్లించాల్సిన నిధులు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరాలు పొందుపర్చడం లేదని పిడికి డిఆర్పీ తెలిపారు. లక్కా రంలో ఉపాధి హామి పథకంలో పని చేసి టెక్నికల్ ఆ సిస్టెంట్ సైతం తన భార్య పేరుతో వ్యక్తిగత మరుగు దొడ్డి నిధులు స్వాహా చేసినట్లు అధికారుల దృష్టికి తీ సుకెళ్లారు. జుగది రావ్ రైతు వ్యవసాయ పొలంలో ల్యాండ్ లేవలింగ్ పనులు చేయకుండ రైతుకు ఈ వి వరాలు తెలయకుండానే డబ్బులు డ్రా చేసినట్లు బహి ర్గతం చేశారు. కూళీల పనులకు వెల్లకుండ, కూలీలకు బదులు ఇతర ప్రజాప్రతినిధుల కుటుంబ సభుల పే ర్లను నమోదు, ఇంకూడు గుంతులు నిర్మించకుండ డబ్బుల డ్రా చేసినట్లు పిడి దృష్టికి తీసుకేల్లారు. అదే వి ధంగా లక్కారం గ్రామంలో 27 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగ 18 మరుగు దొడ్లు పూర్తి అయ్యయని మిగిత 9 మరుగుదొడ్లు సై తం పూర్తి అయినట్లు 12వేల రూపాయల చొప్పున డ బ్బులు డ్రా చేసినట్లు వివరించారు.

చాందురి, లక్షటిపేటా, ఉమ్రి, యెందా గ్రామపంచా యతీలపై చర్చించారు. ఈ పంచాయతీలలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించకుండానే నిధులు డ్రాచేశారని, పనులకు వెల్లకుండ కూలీ పనులు రూపాయలు చెల్లిం చారని, ల్యాండ్ లేవలింగ్, రోడ్లు, ఇంకుడు గుంతలు, మొక్కల సంరక్షణ, తదితర పనుల్లో అక్రమాలు జరిగి నట్లు డిఆర్పీలు విరవరించారు. అనంతరం పిడి రా థోడ్ రాజేశ్వర్ మట్లాడుతూ పనులు చేయకుండ కూ లీ డబ్బులు ఎలా ఇచ్చారని సంబందిత సిబ్బందిపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. పనులు సక్రమంగ నిర్వహిం చేల సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని సూచించా రు. నాటిన ప్రతి మొక్కకు 130 నుండి 140 రూపా యలు ఖర్చు అవుతుందన్నారు.

ఉపాధి హామిలో మంచి మంచి పనులు జరిగేల చూడలన్నారు. ప్రస్తుతం ఉపాధి హామి పథకం ద్వారా గ్రామీణ రోడ్లుకు సిసి రోడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సామాజిక తనిఖీలో విలేజ్ రిసోర్స్ పర్సన్‌లు, డిఆర్పీలు, ఈజీ ఎస్ సిబ్బంది మాత్రమే పాల్గొనం గమర్హం. సామాజిక తనిఖీహఅంటేనే కూలీ సైతం హాజరు కావాల్సింది కాని అధికా రులు పర్యవేక్షణ,సమన్వ య లోపం, కూలీలకు సమాచారం అం దించకపోవడం తదితర కారాణాలని చెప్పవచ్చు.వచ్చిన కొంతమంది కూలీలు కూలీ డబ్బులు రావడం లేదని ఫిర్యాదులు చేశారు. ఇలా మండలంలోని 2015 సెప్టెంబర్ నెల నుండి 2016 అక్టోబర్ వరకు 9కోట్ల రూ పాయల పనులు చేపట్టారు.

ఈ సామాజిక తనిఖీలో పలు అక్రమాలు బహిర్గతం అయిన వాటిని రికవరి చేస్తారో… లేదా సంబందిత సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటారే వేడి చూ డాల్సిందే మరి. ప్రభుత్వం నిధులు రాళ్ల పాలు అన్న ట్లుగా మారింది. ఈ వ్యవస్థ. ఈ సామాజిక తనిఖీలో ఎంపీపీ విమల, జడ్పిటిసి జగ్జీవన్, ఎంపిడిఒ లక్ష్మ ణ్, ఇజిఎస్ ఎపిఒ జగ్దేరావ్, వైస్ ఎంపిపి సలీ మోద్దిన్, పంచాయత్‌రాజ్ ఎఇ జాడి లింగన్న, మండలంలోని ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు తదితరులు పా ల్గొన్నారు.