Home రాష్ట్ర వార్తలు సమీకృత కలెక్టరేట్లు

సమీకృత కలెక్టరేట్లు

  • ప్రతి జిల్లాలో 25 ఎకరాల్లో సకల కార్యాలయ సముదాయాలు
  • ఏడాదిలో పూర్తి చేయాలని సిఎం ఆదేశాలు

Integrated-District-Office-హైదరాబాద్: ప్రతి జిల్లాలో 20-25 ఎకరాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో కూడిన సమీకృత కలెక్టరేట్ సముదాయా లను, పరేడ్ గ్రౌండ్‌తో కూడిన ఎస్‌పి కార్యాలయాలను నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. ఈ మేరకు డిజైన్‌లు రూపొందించి, టెండర్లు పిలిచి, ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేయాలని రహదారలు, భవనాల శాఖను కోరారు. ఇప్పటికే కొత్త కలెక్టరేట్‌లు ఉన్న సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు మినహా మిగతా 28 జిల్లా కేంద్రాల్లో వీటి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణాలపై గురువా రం సిఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి. సింగ్, రామకృష్ణా రావు, శాంత కుమారి, స్మితా సభర్వాల్, ఆర్ అండ్ బి శాఖ సీనియ ర్ అధికారులు సునీల్ శర్మ, గణపతి రెడ్డి, సురేందర్ రావు ఎంఎల్‌ఏ లు మర్రి జనార్ధన రెడ్డి తదితరులు పాల్గొన్నట్లు సిఎంఒ కార్యాల యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డిజైన్లను సిఎం కెసిఆర్ పరిశీలించా రు. జిల్లా కేంద్రాల్లో పోలీస్, ఫైర్ కార్యాలయాలు తప్ప మిగతా కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయా ల సముదాయాలు నిర్మించాలని సిఎం చెప్పారు. వివిధ సందర్భాల్లో సమావేశాలు, స్టేట్ ఫెస్టివల్స్, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వ హించుకోవడానికి అనువుగా ఉండాలని ఆదేశించారు. ముఖ్య మంత్రి, మంత్రులు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో పాటు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించేందుకు వెయ్యి మంది సామర్థంతో సమావేశ మందిరాలు నిర్మించాలని సూచించారు. పచ్చదనం ఉట్టిపడేలా ల్యాండ్ స్కేపింగ్ చేయాలని, వాకింగ్ ట్రాక్స్ ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు, పని చేసే అధికారులకు సౌకర్యంగా ఉండాలని, టాయ్‌లెట్లు, క్యాంటిన్, లంచ్ రూములు, బ్యాంకులు, ఎటిఎం, మీ సేవ, రికార్డు రూం, స్ట్రాంగ్ రూం, విద్యుత్ సబ్‌స్టేషన్, జనరేటర్లు, ఫైర్ స్టేషన్, ఎనిమల్ ట్రాప్ విధిగా ఉండాలన్నారు. ఎక్కువ వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఉండాలన్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు భవన సముదాయాల నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను గుర్తించారని, త్వరలోనే వాటికి లే అవుట్స్ కూడా తయారు చేయాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పరేడ్ గ్రౌండ్స్‌తో కూడిన పోలీసు కార్యాలయాలు నిర్మించాలని సిఎం ఆదేశించారు. తమిళనాడులో పోలీసు కార్యాలయాలు బాగున్నట్లు సమాచారం ఉందని, ఉన్నత స్థాయి బృందం వెంటనే అక్కడికి వెళ్లి అధ్యయనం చేయాలన్నారు. డిజిపి నాయకత్వంలోని బృందం తమిళనాడులో పర్యటన చేసి ప్రభుత్వానికి నివేదక, డిజైన్లు అందించాలని కోరారు. పట్టణ, నగర ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనుల్లో జాప్యం జరగుతోందని, ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి దీనిని నివారించాలని సిఎం సూచించారు.