Home జాతీయ వార్తలు ఏకీకృతం ఆమోదం

ఏకీకృతం ఆమోదం

ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం 

pranav

న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా అపరి ష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీ సులకు సంబంధించిన దస్త్రంపై రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సంతకం చేశారు. మంగళవారం లక్నో పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఫైల్‌పై సం తకం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉత్త ర్వులను కేంద్ర హోంశాఖ త్వరలో విడుదల చేయనుంది. ఉత్తర్వులు అందిన వెంటనే తెలు గు రాష్ట్రాలు సర్వీసు నిబంధనలను తయారు చేసి అమలు పర్చాల్సి ఉంది. రెండు దశాబ్దాలు గా ఉపాధ్యాయ సంఘాలు కలిసికట్టుగా, విడి విడిగా నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా సుప్రీంకోర్టు సెప్టెంబరు 2015న ఇచ్చిన తీర్పు, రాష్ర్ట ప్రభుత్వ చొరవ ఫలితంగా సర్వీస్ రూల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. అన్ని రకాల పదోన్నతుల్లో అందరికీ సమాన అవకాశాలు లభించనున్నాయి. వేలాది మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయి. ఈ మేరకు ఏర్పడిన ఖాళీల్లో నిరుద్యోగులకు ఉద్యో గాలు వస్తాయి. ఏకీకృత సర్వీస్‌రూల్స్ అమల్లో కి రాగానే దాదాపు 90% పైగా ఖాళీగా ఉన్న ఎంఇఒలు, డిప్యూటీ ఇఒ పోస్టులను భర్తీ చేసేం దుకు విద్యాశాఖకు అవకాశం ఉంటుంది. ఉన్న త పాఠశాలలో సీనియర్ ప్రధానోపాధ్యా యులకే ఎంఇఒ అదనపు బాధ్యతలు అప్పగించారు. పుష్కర కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

ఈ పోస్టులను భర్తీ చేస్తే, సర్కారు బడులపై పర్యవేక్షణ పెరిగి పాఠశాల విద్య బలోపేతమవుతుంది. గతంలోనూ ఏకీకృత సర్వీస్ రూల్స్ ఫైలుకు ప్రధాని ఆమోదం తెలిపిన తర్వాత అది రాష్ర్టపతి వద్దకు వెళ్లి తిరస్కరణకు గురయింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పునకు ముందు రాష్ర్టపతి ఆమోదం కోసం ఫైలు వెళ్లింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు రెండు అంశాలతో కూడిన తీర్పును వెలువరించింది. ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూనే పంచాయతీరాజ్, ప్రభుత్వ యాజమాన్య టీచర్లకు ఒకే సర్వీసు నిబంధనలు రూపొందించుకునే అధికారం రాష్ర్ట ప్రభుత్వానికి ఉందని, అందుకు రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు తుది తీర్పునకు అనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వాలు రూపొందించిన ఏకీకృత ఫైలును రాష్ర్టపతి తిరస్కరించే ప్రసక్తే లేదని, దీనికి రాష్ర్టపతి ఆమోదం కూడా లభిస్తుందని ఇప్పటివరకు భావించిన ఉపాధ్యాయ సంఘాలు, రాష్ర్టపతి ఆమోదం తెలపడంతో ఆనందంలో ఉన్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (%ుూూ%) రాష్ర్ట అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హనుమంతరావులు మాట్లాడుతూ టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనల ఫైల్ క్లియర్ చేసినందుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలు, విద్యాశాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక సర్వీసు నిబంధనలు ఎంత త్వరగా అమలు చేస్తారనేది రెండు తెలుగు రాష్ట్రాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉందన్నారు.
పలువురు హర్షం
ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ నిబంధనలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపడం పట్ల రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్రం(ఎస్‌టియుటిఎస్) అధ్యక్షులు బి.భుజంగరావు, శాసనమండలిలో ప్రభుత్వఛీఫ్ విప్, ఉపాధ్యాయ ఎంఎల్‌సి పాతూరి సుధాకర్‌రెడ్డి, టిపియుఎస్ నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, హనుమంతరావు, భూమయ్య, టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.రఘునందన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం , మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలు హర్షం వ్యక్తం చేశారు.