Home పెద్దపల్లి సమయం కన్నా మేధస్సు విలువైనది

సమయం కన్నా మేధస్సు విలువైనది

Intelligence

ఓదెల : సమయం కన్నా మనవుని మేధస్సు ఎంతో విలువైనదని, మనిషి స్థాయిని బట్టి సమయం విలువ నిర్ధారించ బడుతుందని, ప్రతీ వ్యక్తికి జ్ఞానంతోపాటు గౌరవం లభిస్తుందని ప్రముఖ సైకాలజిస్ట్ బైరి నరేష్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పొత్కపల్లి ఎస్‌ఐ పర్శ రమేష్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశా లలకు చెందిన పదవతరగతి పరీక్షలకు హాజర య్యే విద్యార్థులకు భరోసా సదస్సును శుక్రవారం నిర్వహించారు.

బైరి నరేష్ మాట్లాడుతూ విద్యా ర్థులకు పదవతరగతి పరీక్ష అనేది లక్షాన్ని చేరుటకు తొలిమెట్టు అన్నారు. ఈ కార్యక్ర మంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ జావీ ద్, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ జితేందర్‌రెడ్డి, ఎస్ ఎంసి చైర్మన్ కుమార స్వామి, శ్రేష్ఠ, గుంపుల సర్పంచ్ ఉప్పుల సంపత్‌కుమార్, శ్రీనివాస్, పల్లె కుమార్ గౌడ్, పోలీస్ సిబ్బంది, మండలంలోని ప్రభుత్వ పాఠశాల అధ్యాప కులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.