Search
Tuesday 20 November 2018
  • :
  • :

అనంతపురంలో విషాదం…

SUICIDE

అనంతపురం: ఎపిలోని అనంతపురంలో మరో కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని శ్రీసాయి మహిళా జూనియర్ కళాశాలలో చదువుతున్న యమున అనే విద్యార్థిని మంగళవారం ఉదయం వసతి గృహంలో ఆత్మహత్య చేసుకుంది. తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కాసేపటికి ఆమె స్నేహితులు గదికి రాగా… యమున ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో వారు కాలేజీ సిబ్బందికి తెలిపారు. కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఆ గదిలో సూసైడ్ నోట్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Inter Student Commits Suicide in Anantapur.

Comments

comments