Search
Tuesday 20 November 2018
  • :
  • :

13న ఇంటర్ పరీక్ష వాయిదా లేదు : కడియం శ్రీహరి

kadiyam

హైదరాబాద్ :మార్చి 13న ఇంటర్ పరీక్ష వాయిదా వేయడం లేదని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో కడియం మాట్లాడుతూ. ఎస్సి వర్గీకరణకై మార్చి 13న ఎమ్మార్పీఎస్ బంద్‌కు పిలుపునివ్వడం సరికాదన్నారు. 13వ తేదీన పరీక్షను వాయిదా వేద్దామంటే వీలు కావడం లేదని స్పష్టం చేశారు. ఎస్సి వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ బంద్ వల్ల నష్టపోయేది తెలంగాణ బిడ్డలే అని తెలిపారు. ఇంటర్ పరీక్షలను త్వరగా పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయలను కుంటున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలు ఆలస్యమైతే విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు సన్నద్ధం కాలేరని చెప్పారు. ఎంపిలు రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో ధర్నా చేస్తున్నారు. గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ధర్నాదిగనున్నామని కడియం వివరించారు.

Comments

comments