Friday, March 29, 2024

ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇంటర్‌బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించిం ది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించగా, ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వ రకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. రెండో శనివారం, ఆదివారాల్లో కూడా ప్రాక్టికల్స్ రెండు సెషన్స్‌లలో జరుగుతాయి. ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంట ల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా 2023–24లో జాయిన్ అయిన వి ద్యార్థులకు మాత్రమే ఫిబ్రవరి 16వ తేదీన(ఒక్క రోజు) మాత్రమే ఇంగ్లీష్ మొదటి సంవత్సరం ఫైనల్ ప్రాక్టికల్ నిర్వహిస్తారు. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఈ విద్యా సంవత్సరానికి ముందు ప్రవేశించిన పాత విద్యార్థులకు, బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులకు ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్..
28-2-2024 – సెకండ్ లాంగ్వేజ్
1-3-2024 – ఇంగ్లిష్ పేపర్-1
4-3-2024 – మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్
6-3-2024 – మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ
11-3-2024 – ఫిజిక్స్, ఎకనామిక్స్
13-3-2024 – కెమిస్ట్రీ, కామర్స్
15-3-2024 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకే)
18-3-2024 – మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ

ఇంటర్ సెకండియర్ షెడ్యూల్..
29.2.2024 సెకండ్ లాంగ్వేజ్-2
2.3.2024 ఇంగ్లీష్ పేపర్ 2
5.3.2024 మ్యాథ్స్-2ఏ /బోటనీ/పొలిటికల్ సైన్స్ పేపర్-2
7.3.2024 మ్యాథ్స్-2బి/జువాలజీ/హిస్టరీ పీపర్-2
12.3.2024 ఫిజిక్స్/ఎకనామిక్స్ పేపర్-2
14.3.2024 కెమిస్ట్రీ/కామర్స్ పేపర్-2
16.3.2024 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్2
19.3.2024 మోడ్రన్ లాంగ్వేజ్/జాగ్రఫీ పేపర్-2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News