Home తాజా వార్తలు హైదరాబాద్‌లో తట్టుబాజీ గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్‌లో తట్టుబాజీ గ్యాంగ్ అరెస్ట్

ARREST

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులను తుపాకులతో బెదిరించి దోపిడిలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నేర ముఠా తట్టుబాజీ గ్యాంగ్‌ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా ప్రధాన సభ్యులు హర్షద్, హసన్ మహ్మద్‌లను ఇక్కడి పోలీసులు పట్టుకోగా.. మిగిలిన నలుగురిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశౠరు. తెలంగాణ, ఎపిలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ముఠా నేరాలకు పాల్పడినట్లు అడిషనల్ సిపి స్వాతి లక్రా తెలిపారు. వందల సంఖ్యలో సిసి కెమెరాలు కావాలని వ్యాపారులకు ఫోన్లు చేసి.. వారు రాజస్థాన్ రాగానే బంధించి డబ్బులు లాక్కోవడం చేస్తారని తెలిపారు. అంతేకాక బాధితుల కుటుంబాలకు ఫోన్లు చేసి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేయాలని బెదింరింపులకు పాల్పడేవారి ఆమె తెలిపారు.