Home తాజా వార్తలు ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

Inter Student Commits Suicide due to Eve Teasing

యాదాద్రి భువనగిరి:  ఈవ్ టీజింగ్ వేధింపులతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన దారుణ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరులో చోటు చేసుకుంది. కావ్య (16) అనే విద్యార్థిని ఆలేరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శివలాల్‌ తండాకు చెందిన శేషుతో కలిసి ఆమె కళాశాలకు వెళ్లేది. వీరిద్దరూ కలిసి వెళ్తున్నసమయంలో పవన్‌ అనే యువకుడు వారి ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు పంపించాడు. అంతటితో ఆగకుండా కావ్య, శేషుల గురించి దుష్ప్రచారం చేశాడు. దీంతో కావ్య మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కావ్య మృతికి పవనే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు మృతదేహంతో అతడి ఇంటిముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.