Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కడుపునొప్పి భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Inter-Student-Suicide

అమరచింత : కడుపునొప్పి భరించలేక ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండల కేంద్రంలోని బిసి కాలనీలో శుక్రవారం చోటు చేసుకొంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం బిసి కాలనీలో నివాసముంటున్న తోకలి నాగరాజు, గట్టమ్మ దంపతుల కూతురు రజిత(16) పాలమూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. వేసవి సెలవుల్లో తల్లిదండ్రుల దగ్గరి వచ్చింది. గత నాలుగు రోజుల నుండి రజితకు కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరింది. శుక్రవారం ఉదయం పొలంపనులు చూసుకొన్న తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు ఆమెకు చెప్పారు. పొలం వెళ్లిన తర్వాత ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌పోసుకొని నిప్పంటించుకొని అక్కడికక్కడే మృతి చెందిందని తండ్రి నాగరాజు, గట్టమ్మలు విలపిస్తు తెలిపారు. సంఘటనకు సంబందించిన వివరాలను విఆర్‌ఒ నాగిరెడ్డి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

Comments

comments